40 బియ్యం బస్తాలు స్వాధీనం
ప్రొద్దుటూరు:
చౌకదుకాణాలకు సంబంధించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్ భాస్కర్‌రెడ్డికి అప్పగించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అప్పే ఆటోలో 10 బస్తాల బియ్యాన్ని తీసుకుని కర్నూలు జిల్లా బనగానపల్లెకు వెళుతుండగా వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే మినీ వ్యాన్‌లో మరో 30 బస్తాలను తీసుకెళుతుండగా రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించారు.