Transport Minister Nitin Gadkari
-
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పాత వాహనాలను స్క్రాప్‌కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్‌లో 25 శాతం దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. కాలుష్యం వెదజల్లుతున్న పాత వాహనాలను వదిలించుకునేలా వాహదారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ప్రెస్ నోట్లో పేర్కొంది. దీని ప్రకారం రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలకు 25 శాతం దాకా, రవాణా (వాణిజ్య)వాహనాలకు 15 శాతం దాకా కన్సెషన్ లభించగలదని కేంద్రం తెలిపింది. రవాణా వాహానాలకు ఎనిమిదేళ్ల దాకా, రవాణాయేతర వాహనాలకు 15 ఏళ్ల వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈ నిబంధనలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీని ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ తప్పనిసరి కానుంది. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తారు. చదవండి: కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన -
త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశంలో ప్రజా రవాణా వ్వవస్థలో కార్యకలాపాలను త్వరలోనే పున:ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు. ఆయన బుధవారం ‘బస్సు, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు. ప్రజారవాణాను ప్రారంభించే విష యంలో భౌతిక దూరం పాటించడం, ఫేసు మాస్కులు, శానిటైజర్లు వాడడం వంటి నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆపరేటర్లు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. గ్లోబల్ మార్కెట్లో పాగా వేయండి కరోనా వల్ల తలెత్తిన విపత్తును అవకాశంగా మార్చుకోవాలని ప్రజా రవాణా రంగంలోని పెట్టుబడిదారులకు గడ్కరీ సూచించారు. గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడంపై దృష్టి పెట్టాలన్నారు. కరోనాపై, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై భారత్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడి స్వల్పంగా, ప్రైవేట్ వ్యయం అధికంగా ఉండే లండన్ తరహా ప్రజా రవాణాను మన దేశంలోనూ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. హైవే ప్రాజెక్టుల పనులను పున:ప్రారంభించడంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. -
కాలుష్య రహిత రహదారులు
- ఐదేళ్లలో రూ.5వేల కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం: గడ్కారీ సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్-కాలుష్య ముక్త్ భారత్ నినాదంతో కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఐదు లక్షల కోట్ల రూపాయలను జాతీయ రహదారుల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో వెచ్చించనున్నామని, అందులో నుంచి ఒక శాతం... ఐదు వేల కోట్లు జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమానికి కేటాయిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. దీంతో జాతీయ రహదారులు నిర్మాణాలు జరిగే గ్రామాల్లోని రైతు లు, నిరుద్యోగులు, మహిళలకు ఉపాధి కల్పించాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఢిల్లీ లో మంగళవారం నిర్వహించిన హరిత జాతీ య రహదారులవిధానంపై జరిగిన సదస్సులో గడ్కారీ మాట్లాడారు. దేశంలోని 48లక్షల కి.మీ రహదారుల్లో, 96వేల కి.మీ జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. రాను న్న రోజుల్లో 1.50 లక్షల కి.మీ వరకు జాతీయ రహదారులను విస్తరిస్తామన్నారు. దేశంలోని ట్రాఫిక్‌లో 20 శాతం జాతీయ రహదారులపైనే ఉంటోం దని, ప్రతి ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.50 లక్షల మంది చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన నాలుగు లేన్ల విస్తరణకు చర్యలు చేపట్టనున్నామన్నారు. వాహన కాలుష్య నివారణకు రానున్న రెండేళ్లలో పెట్రో, డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను రోడ్లపైకి తీసుకురానున్నామన్నారు. మురుగునీటిని రీస్లైకింగ్తో పునర్వినియోగిస్తామన్నారు. పర్యావరణ రక్షణకు కృషి చేసేవారికి జాతీయ స్థాయిలో 3, రాష్ట్రస్థాయిలో ఒక్కోటి చొప్పున అవార్డులను అందచేస్తామని గడ్కరీ చెప్పారు.