Transport Officer
-
మరోసారి రెచ్చిపోయిన TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
-
‘కాలుష్య’ వాహనాలపై కొరడా
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ పాటించని వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ కార్డులు సస్పెన్షన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రవాణా అధికారులు రంగంలోకి దిగారు. రవాణా అధికారులు నిర్వహించే పొల్యూషన్ టెస్ట్‌లలో ఫెయిలైయితే వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు కాలుష్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ సూచించింది. పొల్యూషన్ పరీక్షలు చేయించి ప్రతి వాహనదారుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పొందాలి. కార్లు, ఇతర వాహనాలకు కార్బన్ మోనాక్సైడ్ 0.3 శాతం, హైడ్రో కార్బన్ 200 పీపీఎంలోపు ఉండాలి. కాలుష్య ఉద్గారాలు ఇంతకు మించి ఉంటే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాలం చెల్లిన వాహనాలపైనా అధికారులు దృష్టి సారించారు. -
రవాణా శాఖ సీనియర్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
-
18 ఇళ్ల స్థలాలు, రెండు కిలోల బంగారం!
సాక్షి, నెల్లూరు : రవాణా శాఖ సీనియర్ అసిస్టెంట్ సరసింహా రెడ్డి ఇంటిపై ఏసీబీ మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు పట్టణంలోని బంధు, మిత్రుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ దాడుల్లో నగదు, పెద్ద ఎత్తున డాక్యుమెంట్ పత్రాలను స్వాధీనపరచుకున్నారు. పలువురు రవాణా శాఖ ఉద్యోగులకు నరసింహారెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఈ దాడుల్లో గుర్తించారు. నగరంలోని ఇతర రవాణా అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ మెరుపు దాడులు చేసింది. నరసింహారెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఆయనకు నెల్లూరులో 18 ఇళ్ల స్థలాలు, రెండు కిలోల బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
విజయవాడ: ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిని మాటువేసి పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూటబెట్టారన్న ఆరోపణలపై శ్రీకాకుళం రవాణా శాఖ అధికారి హైమారావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నల్గొండ, ఏలూరు, రాజమండ్రి, వైఎస్సార్ జిల్లాల్లోని ఆయన ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏసీబీ డీజీ ఆర్టీ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహించారు. హైమారావు భార్య పేరిట రాజమండ్రిలో విలువైన నివాస స్థలం, రాజమండ్రి, నల్గొండల్లో 11 ఇళ్ల స్థలాలు, ఏలూరు మండలం కొప్పాకలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, విజయవాడ, విశాఖపట్నంలో కుమార్తెల పేరిట రెండు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం అరకిలో బంగారం, 5 కిలోల వెండి, రూ.2.8లక్షల నగదు, రూ.13 లక్షల విలువైన కారు, 12 మద్యం సీసాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని పలు బ్యాంకుల్లో మూడు లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల విలువ రూ.20 కోట్లకు పైగానే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.