భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం
నల్లగొండ: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. వలిగొండ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి.
శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వలిగొండ మండలం గోకారం సమీపంలో రహదారి తెగిపోయింది. దీంతో గోకారం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.