ట్రాష్‌రాక్ పనుల పరిశీలన
నాగార్జునసాగర్: స్థానిక ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రంలోని పెన్‌స్టాక్ ట్రాష్‌రాక్ గేట్ల పనులను గురువారం సీఎండీ ప్రభాకర్‌రావు, హైడ్రో ఎలక్ట్రికల్ డైరెక్టర్ వెంకట్రాజన్లు పరిశీలించారు. రూ.12 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా ఈ సీజన్లో అయ్యేంత వరకు పనులు పూర్తి చేసి, అనంతరం వచ్చే సీజన్లో మిగతా పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతకుముందు ఎడమకాల్వ వద్ద గల విద్యుదుత్పాదక కేంద్రం వద్ద ఎస్ఈ రాజనర్సింహా, డీఈ సత్యనారాయణలు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.