Travel charges
-
రవాణా ఛార్జీలు పెంపు!
ప్రముఖ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!
ఒకప్పుడు ఏ కొద్ది మందికో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే ఉద్యోగ విధులు) భాగ్యం ఉండేది. కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అన్నది ఐటీ ఉద్యోగులకు పరిచయమే. కానీ, కరోనా మహమ్మారి వచ్చి.. ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేసుకునేలా చేసింది. తప్పనిసరైన ఏ కొద్ది మందో తప్పించి మిగిలినవారు ప్రస్తుతానికి ఈ విధానంలోనే కొనసాగుతున్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగుల జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీలు, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ ఇందుకు అనుకూలిస్తున్నాయి కూడా. కానీ, నాణేనికి రెండో కోణం కూడా ఉన్నట్టే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించడమే కాదు.. పన్ను పరమైన అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం వల్ల తీసుకుంటున్న కొన్ని రకాల అలవెన్స్‌లు ఇంటి నుంచి చేయడం కారణంగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపులు, వివరణలు వస్తే తప్ప పన్ను చెల్లింపుల బాధ్యత ఉద్యోగులపై ఉంటుంది. ఈ అంశాల గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి అందుకుంటున్న వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) అన్నవి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు కలిగినవి. కానీ, బయటకు వెళితే కరోనా రిస్క్ ఉంటుందన్న కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నప్పుడు.. పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి రోజువారీ రవాణా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మినహాయింపులపై ప్రభావం.. వేతనంలో హెచ్ఆర్ఏ ఒక భాగం. ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటూ.. అద్దె చెల్లింపులు చేస్తున్నట్టయితే నిర్దేశిత పరిమితి మేరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతనంలో నిర్ణీత శాతం, వాస్తవంగా తీసుకున్న హెచ్ఆర్ఏ, వాస్తవంగా చెల్లించిన అద్దె వీటిల్లో ఏది తక్కువ అయితే దానిని మినహాయింపుగా చూపించుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారికి మూల వేతనంలో 50 శాతం, ఇతర పట్టణాల్లో ఉంటున్నట్టు అయితే మూల వేతనంలో 40 శాతాన్ని క్లెయిమ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కారణంగా చాలా మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో.. వారికి ఈ వెసులుబాటు లభించింది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాస్తంత రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వారిది. సొంత ఇల్లు... హెచ్ఆర్ఏ! కొందరు ఇప్పటి వరకు ఉంటున్న అద్దె ఇళ్ల నుంచి తక్కువ అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. హెచ్ఆర్ఏ తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండని వారు కచ్చితంగా ఆ మొత్తంపై పన్ను చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు చెల్లించిన అద్దెతో పోలిస్తే తక్కువ అద్దెకు మారిన వారిపైనా పన్ను భారం ఆ మేరకు పడుతుంది. అలాగే, తమ నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చుకున్న వారి విషయంలోనూ నిబంధనలు మారిపోతాయి. ఎందుకంటే మెట్రో నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వారికి మినహాయింపుల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాలి. ట్రూఅప్ౖపై దృష్టి... ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే సంబంధిత సంవత్సరంలో ఉద్యోగి పన్ను బాధ్యతను కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పన్ను మొత్తాన్ని నెలవాయిదాల రూపంలో వేతనం నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగి సమర్పించిన డిక్లరేషన్.. అదే విధంగా ఆర్థిక సంవత్సరం చివర్లో (జనవరి తర్వాత) ఉద్యోగి ఇచ్చే తుది డిక్లరేషన్, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అదనంగా పన్ను వసూలైందా లేక తక్కువ పన్ను వసూలైందా అన్న నిర్ధారణకు వస్తాయి. దీన్నే ట్రూఅప్‌గా పేర్కొంటారు. కనుక ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఉద్యోగి తప్పకుండా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంటి అద్దెలో మార్పులు జరిగినా లేక నివాసిత ప్రాంతం మారిపోయినా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్ను వసూలు పరంగా మార్పులు, చేర్పులకు వీలు కలుగుతుంది. ఎల్‌టీఏ... ప్రయోజనం పోయినట్లే! ఎల్‌టీఏ విషయంలో నాలుగు సంవత్సరాలను ఒక బ్లాక్‌గా పరిగణి స్తారు. ఒక బ్లాక్ కాలంలో రెండు పర్యటనల కోసం వాస్తవంగా చేసిన ఖర్చుకు పన్ను మినహాయింపును కోరొచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018–2021గా అమల్లో ఉంది. ఎల్‌టీఏ మినహాయింపును ఒక బ్లాక్‌లో వినియోగించుకోని పరిస్థితుల్లో తదుపరి బ్లాక్‌కు దాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే తదుపరి బ్లాక్‌లో మొదటి సంవ్సరంలోనే దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ.. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనల పట్ల ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, కరోనా ఎప్పుడు సమసిపోతుందో తెలియని పరిస్థితుల్లో.. సమీప కాలానికీ పర్యటనల ప్రణాళికలు పెట్టుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా.. అనువైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కరెంటు, ఇంటర్నెట్ వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ల రూపంలో మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ, ఇటువంటి ప్రోత్సాహకాల గురించి ఆదాయపన్ను చట్టంలో స్పష్టంగా ఇప్పటి వరకు అయితే నిర్దేశించలేదు. కనుక ఈ విధమైన అలవెన్స్‌లు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. -
దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు
లక్నో : లాక్డౌన్ కారణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస జీవుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. స్వస్థలానికి వెళ్దాం అనుకుంటే రవాణా సదుపాయంలేక, ఒకవేళ వాహనాలు ఉన్నా భారీగా పెరిగిన ప్రయాణ చార్జీలను చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కూలీలకు అసరాగా ఉండాల్సిన ప్రభుత్వం నిలువునా దోచుకుంటోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే వలస కూలీల తరలింపు సౌకర్యార్థం యూపీఎస్ ఆర్టీసీ (ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ) పలు వాహనాలను నడుపుతోంది. దీంతో దొరికిందే అదునుగా భావించిన యూపీ సర్కార్ వలస కూలీల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణ ఖర్చులను రాబడుతోంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు- నోయిడా- ఘజియాబాద్ మధ్య దూరం 250 కిలో మీటర్లు. వీటి మధ్య ప్రయాణానికి ఏకంగా రూ.12 వేలు చార్జీగా నిర్ణయించారు. అంతేకాకుండా దూరాన్ని బట్టి ప్రతి కిలో మీటర్‌కు రూ. 50 అదనపు చార్జీలను కూడా కూలీల నుంచి వసూలు చేస్తున్నారు. (24 గంటల్లో 3,722 పాజిటివ్ కేసులు) అదే ఎసీ సౌకర్యం ఉన్న వాహనాల్లో మరికొంత ఎక్కువగా ధరలు పెంచారు. దీనిపై యూపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ శేఖర్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ నేపథ్యంలో 45 మంది ప్రయాణం సామర్థ్యం ఉండే బస్సుల్లో కేవలం 26 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం. వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రం తరిలిస్తున్నాం. ప్రయాణికులు సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సాధారణంగానే టికెట్ చార్జీలను పెంచాం. ఆర్టీసీ బస్సులతో పాటు టాక్సీలను కూడా అందుబాటులో ఉంచాం. వాహనాన్ని బట్టి టికెట్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. 250 కిలో మీటర్ల ప్రయాణానికి బస్సు చార్జీ రూ. 10వేలు, ఎస్యూవీ వాహనానికి రూ. 12 వేలు వసూలు చేయబడుతుంది. తాజాగా నిర్ణయించిన ధరల అమలుకు ప్రభుత్వం ఇదివరకే జీవో జారీ చేసింది.’ అని వెల్లడించారు. అధిక ధరలపై వలస కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. తప్పని పరిస్థితిలో చెల్లించాల్సి వస్తోంది. (మద్యం తరలిస్తున్న ఎమ్మెల్యే.. కారు సీజ్!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్యాబ్ ప్రయాణం చవక కాదు
సాక్షి, బెంగళూరు: ఇప్పటివరకు సాధారణ క్యాబ్‌కు ఒక ప్రయాణ చార్జీ, ఏసీ క్యాబ్‌కు ఒక చార్జీ వసూలు చేసేవారు. కానీ గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. క్యాబ్ వాహనం ధరను బట్టి ఇకనుంచీ క్యాబ్ చార్జీలు ఉంటాయి. రాష్ట్ర రవాణా శాఖ క్యాబ్ కొత్త ప్రయాణ చార్జీలను నిర్దేశిస్తూ, ఇంతకంటే ఎక్కువ చార్జీలను వసూలు చేయడానికి వీల్లేదని క్యాబ్ యజమానులకు స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో బెంగళూరులో క్యాబ్ ధరలు కొంతమేర పెరిగాయి. నగరంలోని అన్ని క్యాబ్స్‌ను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించి వాటి కనిష్ట, గరిష్ట ప్రయాణ చార్జీలను నిర్ధారించారు. ఏ కేటగిరీ.. : ఇక రూ. 16 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాల్లో తొలి నాలుగు కిలోమీటర్లకు మినిమమ్ చార్జీ రూ. 80, ఆ తర్వాత ఒక్కో కిలోమీటరుకు రూ. 20–45 మధ్య చార్జీ చేస్తారు. బీ కేటగిరీ..: రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 68. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు చార్జీలను కనీసంగా రూ.16, గరిష్టంగా రూ. 34 వసూలు చేస్తారు. సీ కేటగిరీ..: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను సీ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 52. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు ప్రయాణ చార్జీ రూ.12–24 మధ్య ఉంటుంది. డీ కేటగిరీ.. : రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న క్యాబ్ వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు కనీస ప్రయాణ చార్జీ రూ. 44. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీసం రూ. 11 నుంచి గరిష్టంగా రూ. 22 మధ్య వసూలు చేసుకోవచ్చు. వెయిటింగ్ చార్జీలు : వీటిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 20 నిమిషాలు ఎలాంటి వెయిటింగ్ చార్జీలు ఉండవు. ఆపైనా ప్రతి 15 నిమిషాలకు రూ. 10ను చార్జ్ చేస్తారు. గతంలో క్యాబ్ చార్జీలు.. ♦ 2013, జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ ధరలను సవరించింది. అప్పట్లో తొలి నాలుగు కిలోమీటర్లు ఏసీ క్యాబ్‌లో రూ. 80, ఆ తర్వాత కిలోమీటరుకు రూ. 19.50 చార్జి. ♦ నాన్ ఏసీ క్యాబ్‌లో తొలి నాలుగు కిలోమీటర్లకు రూ. 70, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.14.50 చార్జీ ఉండేది. -
నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు
-
నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు
* ‘మెట్రో’ ప్రయాణికులకు మాత్రం ఊరట * 80 కి.మీల వరకు సెకండ్ క్లాస్ సబర్బన్‌పై భారం లేదు * రైల్వే శాఖ తాజా నిర్ణయం న్యూఢిల్లీ: రైలు ప్రయాణం నేటినుంచి భారం కానుంది. ఇటీవల పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు ఈ రోజు(బుధవారం) నుంచే అమలు కానున్నాయి. అయితే, మెట్రో నగరాల రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. 80 కి.మీల వరకు రెండో తరగతి సబర్బన్ రైలు ప్రయాణాలపై తాజా చార్జీల పెంపు వర్తించదని రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు 80 కిమీల మేర ప్రయాణించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. రైళ్లలో ప్రయాణ చార్జీలను 14.2%, రవాణా చార్జీలను 6.5% పెంచుతూ కేంద్రం జూన్ 20న నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కాగా, మహారాష్ట్రకు చెందిన బీజేపీ, శివసేన ఎంపీలు మంగళవారం రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరిన కొన్ని గంటల తరువాత రైల్వే శాఖ పలు సవరణలతో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులోని వివరాలు.. 8 అన్రిజర్వ్డ్ విభాగంలో జూన్ 25 నుంచి కాకుండా జూన్ 28 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. 8 నెలవారీ పాసులు తీసుకునే ప్రయాణికులు.. గతంలో మాదిరి 30 ట్రిప్పులకు కాకుండా, 15 ట్రిప్పులకు మాత్రమే డబ్బులు చెల్లించి, ఒక నెలలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. 8 {పధాన రైళ్లలో ప్రయాణానికి చార్జీల పెంపు కన్నా ముందే టికెట్లు కొనుగోలు చేసినవారు అదనపు రుసుమును చెల్లించనక్కరలేదు. 8 ముందుగా జారీ చేసిన రైల్వే టికెట్లకు కూడా చార్జీల పెంపు వర్తిస్తుంది. 8 చార్జీల పెంపు నిర్ణయం కన్నా ముందు ప్రయాణ టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారు అదనపు రుసుమును బుకింగ్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ, టీటీఈ వద్ద కానీ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్ లాంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు.