‘అడ్డదారి’ రైల్ ప్రయాణికులపై రూ.65 కోట్ల ఫైన్
హైదరాబాద్: టికెట్ లేని ప్రయాణికులతో రైల్వే శాఖ ఆదాయానికి భారీ గండి పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి రూ.65.04 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించటం, బుక్ చేసుకోకుండా పెద్ద మొత్తంలో సరుకు తరలించటం వంటి నేరాలకు సంబంధించి ఎనిమిది నెలల్లో 19.96 లక్షల కేసులు నమోదయ్యాయి.
టికెట్ లేకుండా 6.17 లక్షల మంది, టికెట్కు సంబంధంలేని కంపార్ట్మెంట్లో ప్రయాణించిన 7.08 లక్షల మంది, బుక్ చేయకుండా లగేజీ తరలించినందుకు 6.71 లక్షల మందిపై కేసులు నమోదు చేశారు.