treating woman
-
పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..
రోగుల ప్రాణాలు కాపాడే వైద్యుడైన మృత్యువుకి బలవ్వాల్సిందే. ఒక్కొసారి మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. చూస్తుండగానే కబళించేసి తన పని చేసుకుని వెళ్లిపోతుంది. తేరుకునేలోపే కథ అయిపోతుంది అదే కథ జీవితం!. అసలేం జరిగిందంటే..ఓవైద్యుడు పేషెంట్‌కి చికిత్స చేస్తూ కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. 38 ఏళ్ల దిలీప్ కుమార్ కుష్వాహా తన క్లినిక్ రోగికి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ వైద్యడు రోగిని తనిఖీ చేస్తుండగా ఛాతి నొప్పితో విలవిలలాడుతు కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ వైద్యుడు షాహదోల్ జిల్లాలో కేస్వాహి గ్రామంలో తన క్లినిక్ నడుపుతూనే సామాజిక సేవలో చొరవ చూపేవాడని పలువురు చెబుతున్నారు. రోగులకు ఉచిత వైద్య అందించడమేగాక ఉచితంగా మందులు కూడా ఇచ్చేవాడని సన్నిహితులు తెలిపారు. పేషెంట్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలు సైతం అతనే చెల్లించేవాడని అంటున్నారు. ఈ రోజుల్లో ఇలా ప్రజలకు ఇలాంటి మెరుగైన సేవలందించే వ్యక్తే మృత్యువు కబళించడం అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. (చదవండి: వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..) -
ఫోటో కాదిది..ఇండియా చిత్రపటం
బెంగళూరు: డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావొస్తున్నా..ఓ చిత్రకారుడు ఇంతకు మించి బెటర్‌గా భారతదేశ చిత్రపటాన్ని గీయలేడు...అంటూ క్యాప్షన్ ఉన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇంత క్రూరమైన మనస్తత్వం ఉన్న వారి నుంచి మనకు ఎప్పటికైనా విముక్తి కలుగుతుందా? ఎదో ఒక రోజైనా మహిళలను ఓ వస్తువుగా చూడటం మానేస్తామని.. రకుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి.. బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో) Will v ever get rid of this mentality? Mayb one day v will stop treating woman as a commodity. #shamemolesters pic.twitter.com/PMAOB5zj9D — Rakul Preet (@Rakulpreet) January 5, 2017