tree fall
-
అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలీదు: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ఎల్జీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలోని చెట్లను నరికివేయడానికి కోర్టు అనుమతి అవసరమని తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై నేడు(బుధవారం) సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. రిడ్జ్ ప్రాంతంలో దాదాపు 600 చెట్లను నరికేయడంపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం.. అక్రమంగా 600 చెట్లను నేల కూల్చడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోవివరిస్తూవ్యక్తిగత అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఎల్జీని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాయన తాజాగా ప్రమాణపత్రం సమర్పించారు.ఇందులో తాను రిడ్జి ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ నిర్మించాలనుకున్న ప్రదేశాన్ని ఫిబ్రవరి 3వ తేదీన సందర్శించినట్లు ఎల్జీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ నిర్మాణ అవసరం, ప్రాధాన్యం, దానికి కేటాయించిన వనరుల అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు విస్తరణ జరుగుతున్న స్థలంలో ఆగినట్లు తెలిపారు. నాడు కోర్టు అనుమతి లేకుండా చెట్లను నరికివేయకూడదనే అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు.అయితే.. ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు అనుమతి కోరుతూ డీడీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మాత్రమే మార్చి 21న ఆ విషయం తనకు తెలిసినట్లు ఎల్జీ చెప్పారు.. చెట్లను నరికివేయడానికి కాంట్రాక్టర్లకు డీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోజ్ కుమార్ యాదవ్, డీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ కుమార్, ఆయుష్ సరస్వత్‌లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీరే నరికివేతకు అనుమతించారని తెలిపారు.పంకజ్ వర్మ, సూపరింటెండింగ్ ఇంజనీర్ యాదవ్‌లను కోర్టు నుండి వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.చెట్లను నరికివేయడంపై కొందరు డీడీఏ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. చైర్పర్సన్ అంగీకరిస్తే, చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని పేర్కొంది. -
నగరానికి వరుణుడి సైరన్!..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున గాలి దుమారంతో కూడిన భారీ వర్షం దడ పుట్టించింది. నగర అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వర్షాకాలంలోగా ముంపు ముప్పు తప్పించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించినప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగలేదు. దీంతో ముంపుముప్పు పొంచే ఉంది. గంటసేపు కురిసిన ఒక్కవానకే వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. రోడ్లపై జనసంచారం లేని సమయం, సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా గండం గట్టెక్కినప్పటికీ, వర్షాకాలంలో తలెత్తనున్న అసలు సినిమాకు టీజర్ రిలీజ్ అయిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వరద సమస్యలకు పరిష్కారం చూపే నాలాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌లోగా ఇరవై శాతమే పూర్తికాగలవని అధికారులే చెబుతుండటంతో ఈసారీ వాన కష్టాలు పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. వర్షాలు కూడా తోడైతే పనులు జరిగే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన పరిస్థితిని ప్రకృతి హెచ్చరించింది. డీసిల్టింగ్ పనులు సైతం పూర్తికాకపోవడంతో వరద, డ్రైనేజీ కలగలసి పారిన చిత్రాలు కనిపించాయి. నాలాల పనులు పూర్తికానందున నీటినిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటన తోడిపోయాల్సిన చర్యలు తప్పని పరిస్థితి నెలకొంది. ముప్పు.. తప్పేదెప్పుడు? నగరంలో వాన కురిసిందంటే చాలు ప్రధాన రహదారులే చెరువులుగా మారే రంగమహల్ జంక్షన్, మైత్రీవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, ఆర్పీ రోడ్, ఆలుగడ్డబావి, కార్ఖానా మెయిన్‌రోడ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కేబీఆర్ పార్క్, మైలాన్షోరూమ్ (బంజారాహిల్స్), బయోలాజికల్ ఈ లిమిటెడ్,(రామ్‌నగర్), నిజాంకాలేజ్, ఖైరతాబాద్, అయోధ్య జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఇతర ప్రదేశాలు నీటినిల్వ ప్రాంతాలుగా మారాయి. జరిగింది కొంతే.. జరగాల్సింది ఎంతో.. సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణ తదితర పనులు మొదలు పెట్టినా, పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లోని పనులే ఇందుకు నిదర్శనం. నాగమయ్యకుంట నాలా ఆధునికీకరణ పనులు 7 శాతం జరిగాయి. మోహిని చెరువు నుంచి మూసీ నది వరకు వరద కాల్వ పనులు 10 శాతం పూర్తయ్యాయి. యాప్రాల్‌లో నాగిరెడ్డిచెరువు–కాప్రాచెరువు వరదకాలువ పనులు 18 శాతం జరిగాయి. మన్సూరాబాద్ చిన్నచెరువు–బండ్లగూడ చెరువు పనులు 7 శాతం జరిగాయి. బండ్లగూడ చెరువు–నాగోల్ చెరువు పనులు 20 శాతం పూర్తయ్యాయి. నూరినగర్ –డెక్కన్ ప్యాలెస్ వరకు 14 శాతం జరిగాయి. జల్పల్లి ఫిరంగి నాలా– క్యూబా కాలనీ వరకు 3 శాతం మాత్రమే జరిగాయి. సాతం చెరువు నుంచి లంగర్‌హౌస్ (వయా మోతీ దర్వాజా) డ్రెయిన్ పనులు 10 శాతం జరిగాయి. నదీం కాలనీ నుంచి సాతం చెరువు వరకు పనులు 6 శాతం జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వీటికి అటూఇటూగా పనులు జరిగాయి. ఫిర్యాదులెన్నో.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్కు 48 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు ఫిర్యాదులందగా తొలగించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇతర మాధ్యమాల ద్వారా నీటి నిల్వ లు, చెట్లు కూలిన ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ జోన్లో 71 ప్రాంతాల్లో, సికింద్రాబాద్ జోన్లో 54 ప్రాంతాల్లో, చార్మినార్ జోన్లో 35 ప్రాంతాల్లో నీటినిల్వలు తొలగించారు. ఖైరతాబాద్‌జోన్‌లో 42, సికింద్రాబాద్జోన్లో 7, చార్మి నార్ జోన్లో 3 కూలిన చెట్లను తొలగించారు. వర్షాల సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్ 04021111111 లేదా 04029555500 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ పేర్కొంది. -
ఖమ్మంలో విషాదం.. చిన్నారులను చిదిమేసిన రావి చెట్టు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజారులో ప్రమాదవశాత్తు ఓ భారీ రావి వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. సరదాగా ఆడుకుంటున్న చిన్న పిల్లలపై చెట్టు పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన పిల్లల్ని ఆయుష్ (12), దిగంత్(8)గా గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్‌పై అకస్మాత్తుగా రావి చెట్టు పడిపోయింది. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా -
చెట్టే కదా.. అని నరికితే!
కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్ పి.ఉదయ్‌కుమార్ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు. ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. -
తిరుమలలో భక్తుడిపై విరిగిపడ్డ చెట్టు
-
సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి!
మునగాల: తోటి వ్యక్తి అడిగినందుకు సాయం చేసేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మనసును కలిచివేసే ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సాయం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై చెట్టుపడటంతో గాయాలపాలై అతడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన గన్నా వెంకటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టును నరికాడు. అది పూర్తిగా కింద పడకపోవడంతో గ్రామానికి చెందిన కొమర్రాజు నర్సయ్యను సాయం కోరాడు. చెట్టు కొమ్మలకు తాడు కట్టి ఇద్దరూ కలసి లాగుతుండగా అకస్మాత్తుగా ఆ చెట్టు వారిపై పడింది. దీంతో నర్సయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.