tresury dept
-
రష్యా ఔట్! అన్ని దారులు మూసేస్తున్న యూఎస్
US Treasury announced To Close: రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో దురాక్రమణకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వంటి ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ముందుకు వచ్చి యుద్ధాన్ని ఆపేయమన్నా ససేమిరా అంటూనే వచ్చింది. రష్యా ఆటకట్టించేలా ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టేలా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ లావాదేవీలపై ఆంక్షలు విధించాయి కూడా. అయినా రష్యా ఏ మాత్రం దూకుడు తగ్గించపోగా, యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. దీంతో రష్యాను ఆంక్షల నుంచి తప్పించుకోకుండా ఉండేలా దారులన్నింటిని మూసేసింది యూఎస్. అందులో భాగంగానే అమెరికా యూఎస్ ట్రెజరీని మూసేసినట్లు ప్రకటించింది. దీంతో రష్యా విదేశీ రుణాన్ని చెల్లించటానికి యూఎస్ బ్యాంకులోని నిధులను యాక్సెస్ చేసుకునే సామార్థ్యాన్ని నిరోధించింది. ఐతే రష్యా కూడా తన విదేశీ రుణాన్ని రూబెళ్లలోనే చెల్లిస్తానని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు రష్యన్ ఆర్థిక వ్యవస్థను ఏజెంట్‌గా ఉంచి చెల్లింపులు నిర్వహిస్తామని రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలతో రష్యాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరే చేసింది. మళ్లీ అమెరికా ఈ ప్రకటనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ప్రభుత్వ చెల్లింపులు చేయనీకుండా విదేశీ కరెన్సీ నిల్వల పై యూఎస్ షాకిచ్చింది. ఈ మేరకు రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలువానోవ్ మాట్లాడుతూ..."రష్యాకు ఎలాంటి స్నేహ పూర్వ వాతావరణం లేకుండా ఒంటరిని చేసింది. ప్రధానంగా రష్యన్ రుణ సాధనాల్లో విదేశీ పెట్టుబడిదారుల హక్కులను కూడా యూఎస్ దెబ్బతీసింది. అయినా మా వద్ద డబ్బు ఉంది. చెల్లింపులు చేయగలం. ఇదేమీ రష్యన్ జీవన నాణ్యతను పెద్దగా ప్రభావితం చేయలేదు" అని చెప్పారు. ఏదీఏమైన రష్యా విదేశీ రుణాన్ని చెల్లించాలంటే చాలా బాండ్లు రూబెళ్లలో చెల్లించడానికి అనుమతించవు. మే 27న రష్యా చెలించాల్సిన తదుపరి విదేశీ రుణం రెండు బాండ్ల పై 100 డాలర్లు వడ్డీ. అందులో ఒక బాండ్‌కి రష్యా డాలర్లు, యూరోలు, పౌండ్లు లేదా స్విస్ ఫ్రాంక్లలో మాత్రమే చెల్లించాలి, మరోదానికి రూబెళ్లలో చెల్లించవచ్చు. మరోవైపు రష్యా కూడా విదేశీ రుణ ఎగవేత (డీఫాల్ట్) తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే త్వరితగతిన దేశం నుంచి నిధులను బదిలీ చేసింది. ప్రస్తుతం రష్యా జూన్ చివరినాటి కల్లా 400 డాలర్లు విదేశీ రుణం చెల్లించాలి. ఒకవేళ గ్రేస్ పిరియడ్ లోపు చెల్లించకపోతే డీఫాల్ట్‌గా ప్రకటిస్తుంది. 1918లో బోల్షివిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ పదవీచ్యుతుడైన సమయంలో తొలిసారిగా రష్యాని డీఫాల్ట్‌గా ప్రకటించారు. (చదవండి: పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు?) -
వైద్య ఉద్యోగుల ఆందోళన బాట
తణుకు అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగులమా.. ప్రైవేటు ఉద్యోగులమా.. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగా తమని ఎందుకు ట్రెజరీ పరిధిలోకి తీసుకురాలేదు.. సీఎఫ్ఎంఎస్ కోడ్ ఎందుకు ఇవ్వలేదు.. తమపై ఎందుకీ వివక్ష.. ఇది సేవాతత్వంతో కూడిన వైద్యవృత్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగుల మనోవేదన. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రారంభించిన కాంప్రెహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్)లోకి తమను ఎందుకు తీసుకురాలేదనేది ఆ ఉద్యోగులకు ప్రశ్నార్ధకంగా మారింది. ట్రెజరీకి సంబంధం లేకపోవడంతో వారికి రాయితీలు అందడంలేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులతోపాటు వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగులను ట్రెజరీ విధానంలోకి తీసుకువెళ్లినా, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను తీసుకురాలేదు. ట్రెజరీ 101 పద్దు ద్వారా తమకు వేతనాలు ఇవ్వాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. ఈ విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల ఉద్యోగులు ఈనెల 28 నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఈవిధంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. జూలై నెల 2 నుంచి 5వ తేదీ వరకు ఆస్పత్రుల ఎదుట ధర్నాలు చేయనున్నారు. ఏపీవీవీపీ రాష్ట్ర అసోసియేట్ ఆదేశాల మేరకు వైద్యవర్గాలు ఆందోళన బాటపట్టాయి.సీఎఫ్ఎంఎస్ విధానంలేక ఇబ్బందులు సీఎఫ్ఎంఎస్ విధానంలోకి వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో వేతనాల్లో జీపీఎఫ్, జీఐఎస్ రికవరీలు, ఏపీజీఎల్ఐ వంటి సదుపాయాలు మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ రాయితీలు వర్తించడంలేదు. హెల్త్ కార్డుల మంజూరులో జాప్యం, మూడు నెలలుగా వేతనాల్లోంచి నగదు కట్ అవుతున్న బీమా సంస్థలకు చేరడంలేదు. దీంతో బీమా సౌకర్యానికి ఆటంకం ఏర్పడుతోంది. డీఏ, సరెండర్ లీవులు, ఎరియర్స్ అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగికైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా వర్తించకపోవడంతో ఏ రకంగా వైద్యం చేయించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. విభజించి పాలిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను విభజించి పాలిస్తోంది. ట్రెజరీతో సంబంధంలేని వేతనాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ రాయితీల్లో ఎప్పుడూ జాప్యమే. హెల్త్ కార్డులు రాని పరిస్థితి ఉంది. సీఎఫ్ఎంఎస్ విధానంలోకి చేర్చాలి.– వైవీఎస్‌బీ రాయుడు, తణుకు శాఖ కార్యదర్శి,వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10 వేల మందికి ఇబ్బంది ప్రభుత్వ చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విధానంతో మూడు నెలలుగా ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్స్‌లు నిలిచిపోయాయి. మా వేతనాల్లోంచి కట్ అవుతున్న సొమ్ము బీమా సంస్థలకు చేరడం లేదు. ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.– ఎన్ఎస్వీ రామకృష్ణ,జిల్లా కన్వీనర్, వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏలూరు -
అప్పట్లోనే ఖజానా బిల్డింగులు
సాక్షి, సిటీబ్యూరో: కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనా కాలంలోనే ట్రెజరీ వ్యవస్థ ఉంది. అప్పుడే నగరంలో ఖజానా బిల్డింగుల నిర్మాణం జరిగింది. ఇబ్రహీం కుతుబ్‌షా (1550–80) గోల్కొండ కోటలో ఖజానా బిల్డింగ్ నిర్మించగా... రెండో నిజాం నిజామ్‌అలీ 1876లో ఖిల్వత్ ప్యాలెస్ ఎదుట ఖజానా భవనం నిర్మించాడు. వీటిలో ప్రభుత్వ డబ్బు, విలువైన పత్రాలు, ధాన్యం, ఆభరణాలు తదితర ఉండేవి. ఔరంగజేబు దాడి వరకు గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ ప్రభుత్వ ఖజానాగానే కొనసాగింది. అనంతరం కుతుబ్‌షాహీల సైన్యం ప్రధాన కార్యాలయంగా మారింది. తర్వాత ఆసఫ్‌జాహీల కాలంలోనూ ఇది అలాగే కొనసాగింది. ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఇక ఖిల్వత్ ఖజానా భవనం కూల్చివేయగా, స్థలం ట్రెజరీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది. -
పేరోల్ ప్యాకేజీ విధానం అమలు
మచిలీపట్నం (చిలకలపూడి) : ఖజానాశాఖ కార్యాలయాల్లో ఈనెల నుంచి పేరోల్ ప్యాకేజీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్ నందిపాటి నాగేశ్వరరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో అన్నిశాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు, వేతనాలు తయారు చేసే సిబ్బందికి పేరోల్ ప్యాకేజీపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంలో సిబ్బందికి సమయంతో పాటు కాగితాల వాడకం కూడా తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు హెచ్ఆర్ఎంఎస్ విధానంలో జీతభత్యాలు తయారు చేసి బ్యాంకు ఖాతాల వివరాలు జత చేసే వారన్నారు. ఇకపై వీటి అవసరం లేకుండా పేరోల్ ప్యాకేజీ విధానంలో ఉద్యోగి జీతభత్యాలు షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ద్వారా జమ అవుతాయన్నారు. ఈ విధానంలో ఉద్యోగి వేతనాల చెల్లింపులో ఎటువంటి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండదని వివరించారు. ఇప్పటి వరకు మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది జీతాలు ఈ విధానం ద్వారా అక్టోబరు నెల జీతాలు బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరిగిందన్నారు.