గిరిజనకాలనీలో మినరల్ వాటర్‌ప్లాంట్
బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాళెం గిరిజనకాలనీలో దాతల సహకారంతో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు బిట్రగుంట ఎస్సై వెంకటరమణ అన్నారు. పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కాలనీలో జరుగుతున్న ప్లాంట్ పనులను ఎస్సై గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు కాలనీని దత్తత తీసుకుని సమగ్రంగా అభివద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా కాలనీలో గ్రావెల్‌రోడ్లు, ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకంతో పాటు గిరిజనులకు ఆరోగ్య స్పహ పెంచేలా శుద్ధ జలం అందించేందుకు కాలనీలోనే ఉచితంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాలనీవాసులకు రోజూ ఉచితంగా, అపరిమితంగా మినరల్ వాటర్ అందించనున్నట్లు తెలిపారు.