సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
త్రిపురవరం(నడిగూడెం): మండల పరిధిలోని త్రిపురవరంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణపు పనులను మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ పందిరి పాపిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. త్రిపురవరం గ్రామ అభివృద్ధికి ఎమ్యెల్యే ఉత్తమ్ పద్మావతి నిధులను కెటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు వల్లపురెడ్డి వీరారెడ్డి, ఆ గ్రామ మాజీ సర్పంచ్లు మందడి రంగారెడ్డి, కొత్త వెంకటరెడ్డి, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ సీహెచ్.లక్ష్మినారాయణరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు దేవబత్తిని వెంకటనర్సయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం మండల కన్వీనర్ మన్నెం అనంతరెడ్డి, కొత్త నారాయణరెడ్డి, షేక్.సైదులు, గుర్వయ్య, పంచాయతి రాజ్ ఏఈ గార్లపాటి వెంకటరెడ్డి, జేఈ నయీం, తదితరులు పాల్గొన్నారు.