బస్సులన్నీ భాగ్యనగరంవైపే..
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయూణికులు
- బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ
- ఆర్టీసీ నిర్ణయంపై నిరసన
- పొరుగు రాష్ట్రాల బస్సుల్లో ప్రయూణం
నిజామాబాద్ నాగారం: ఆర్టీసీ బస్సుల్లో అత్యధిక భాగం టీఆర్ఎస్ సభకు తరలాయి. దీంతో పనులపై వివిధ ప్రాంతాలకు ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోల పరిధిలో మొత్తం 669 బస్సులు ఉన్నారుు. ఇందులో 575 బస్సులను టీఆర్ఎస్ సభకు తరలించారు. 94 బస్సులు మాత్రమే ప్రయూణికులకు అందుబాటులో ఉన్నారుు. ఇందులో 10 ఇంద్ర బస్సులు, నాలుగు గరుడ బస్సులు, మిగతావి సూపర్‌లగ్జరీ, డీలక్స్ బస్సులు. ఇవి కూ డా హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు నడిచారుు. అరకొరగానే బస్సులు నడవడంతో ప్రయూణికులు గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షించాల్సి వచ్చింది. హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయూణికులకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కు చెందిన బస్సులు ఉపయోగపడ్డారుు. గ్రామీణ ప్రాంతాల కు వెళ్లే ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రైవేట్ వాహనాల హవా
ఆర్టీసీ బస్సులు ఎక్కువగా టీఆర్ఎస్ సభకు తరలివెళ్లడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రరుుంచాల్సి వచ్చింది. ఆటోలు, జీపులు, సుమోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా ప్రైవేట్ వాహనాలవారు ప్రయూణికులను దోచుకున్నారు. సాధారణ చార్జీలకన్నా ఎక్కువగా చార్జీ తీసుకున్నారు.
కండక్టర్లకు సెలవుపై..
ఇక ఆర్టీసీలో డ్రైవర్లు మాత్రమే విధులు నిర్వహించారు. 575 బస్సులకు సంబంధించిన కండక్టర్లను సెలవుపై పంపారు. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులను టీఆర్ఎస్ సభకు తరలించి కండక్టర్లను లీవ్ పెట్టమనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. కాగా టీఆర్ఎస్ సభకు బస్సులను నడపడం వల్ల సోమవారం రూ. 75 లక్షల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ సీటీఎం గంగాధర్ తెలిపారు.
మంగళవారం ఉదయం నుంచి ప్రయాణీకులకు బస్సు లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ, ఆర్టీసీ యూజమాన్యం వ్యవహరించిన తీరుపై ప్రయూణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.