నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపికచేసే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిమగ్నమయ్యారు. నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు, మంత్రులతో కేసీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లా నేతలు, మంత్రులతో చర్చించిన అనంతరం నల్లగొండ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.