కేజీబీవీలను అభివృద్ధి చేయాలి
అసోంలోని లహరి ఘాట్ కేజీబీవీని సందర్శించిన కడియం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాల (కేజీబీవీ)ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసర ముందని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం అసోం మోరిగావ్ జిల్లా లహరిఘాట్ కస్పూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సతీమణి వినయా రాణితో కలసి సందర్శించారు. బోధన ప్రక్రియ, వసతుల కల్పనను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సమావేశమయ్యారు. బాలికల విద్యపై కేంద్రం నియమించిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం సందర్భంగా కడియం శనివారం గువాహటి వెళ్లారు. కేజీబీవీలను 8వ తరగతికే పరిమితం చేయకుండా 12వ తరగతి వరకు పెంచాలని, దీన్ని పూర్తిగా కేంద్ర ఆర్థిక సాయంతోనే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.