టీటీడీ భక్తి చానల్‌పై చదలవాడ ఫైర్
తిరుపతి : టీటీడీ భక్తి చానల్ తీరుపై తిరుమల తిరుపతి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ భక్తి చానల్ ఓ అవినీతి పుట్ట అని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాలుగా రూ.కోట్లు దుర్వినియోగం చేశారని చదలవాడ శుక్రవారమిక్కడ ఆరోపించారు. భక్తి చానల్ అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.