శాలివాహనుల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి
వేళంగి(కరప): రాష్ట్రంలోని శాలివాహనుల సంక్షేమానికి కృషిచేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి కె.నాగేం
ద్ర తెలిపారు. వేళంగిలో బుధవారం జరిగిన శాలివాహనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాలివాహనుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసిందన్నారు. తమ పిల్లలను చదివించి, ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వమిచ్చే నిధులతో ఒక్కొక్కరికి రూ.2 లక్షలు వంతున, అయిదుగురు కల్సి ఒక గ్రూపుగా ఏర్పడితే రూ.10 లక్షలు వంతున వ్యాపారం చేసుకొనేందుకు రుణంగా మంజూరు చేస్తామన్నారు. నిరుద్యోగులు శాలివాహన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే, వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్ నుంచి మేయర్, శాసనసభ్యులు వంటి పదవులేకాక, అన్నిరంగాలలో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంఘం రాష్ట్ర కోశాధికారి సఖినేటిపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, కాకినాడ డివిజన్ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, మండలశాఖ అధ్యక్షుడు కాజులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.