ఐసీయూలో మృత్యుఘోష.. 663 మందిలో 441 మంది మృతి
సాక్షి, బెంగళూరు: జిల్లా కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో కొన్నినెలలుగా కరోనా చికిత్స పొందిన 663 మందిలో 441 మంది కన్నుమూశారు. కోలుకుని 222 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఐసీయూలో చేరిన రోగుల బంధువులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఐసీయూలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన