turbulanace
-
విమానంలో భారీ కుదుపులు.. ఏడుగురికి గాయాలు
బీజింగ్: సింగపూర్ నుంచి చైనాలోని గంగ్జూ పట్టణానికి వెళుతున్న స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం భారీ కుదుపులకు గురైంది. కదుపుల కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది.గంగ్జూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం భారీ కుదుపులకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. ఫ్లైట్ రాడార్ వివరాల ప్రకారం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 25వేల అడుగులకు వచ్చేసింది. వేగం కూడా ఒక్కసారిగా 500 నాట్స్ నుంచి 262 నాట్స్‌కు తగ్గింది. తర్వాత మళ్లీ 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి 500 నాట్స్ వేగంతో ప్రయాణించింది. -
ఊగిపోయిన ఫ్లైట్.. ముక్కులు, మూతులు పగిలాయ్!
బ్యూనస్ ఎయిర్స్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఆకాశంలో ఉండగా.. తీవ్ర కుదుపునకు లోనైంది. ఆ దెబ్బకు ప్రయాణికులు విమానంలో చెల్లాచెదురై గాయపడ్డారు. కొందరు ప్రయాణికులకు ముక్కులు, మూతులు పగిలినట్లు సమాచారం. అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు వణికిపోయనట్లు తెలుస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్ అర్జెంటీనాస్ A330 విమానం భారీ కుదుపునకు లోనైంది. మాడ్రిడ్ నుంచి బ్యూనస్ ఎయిర్స్ వెళ్లాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 18న ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సెక్యూరిటీ బెల్ట్ ధరించాలని సిబ్బంది మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. విమానం ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. చాలాసేపు అది కుదిపేసింది. దీంతో ఒక్కసారిగా అంతా చెల్లాచెదురై పడిపోయాం అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది సైతం ఇబ్బంది పడ్డారని మరో ప్రయాణికుడు వెల్లడించాడు. Bueno pues hubieron unas turbulencias en las que no nos avisaron para ponernos el cinturón y todo el mundo salió volando. Hasta las azafatas por el pasillo. Estos desperfectos en el avión están hechos con la cabeza. Las últimas 7 horas de vuelo una puta pesadilla. https://t.co/xXdzxYEXmO pic.twitter.com/g5wwmigeWL — Adrianceitor (@adrianceitor_) October 19, 2022 ఆ ఘటన తర్వాత ఏడు గంటలపాటు భయం భయంగా ప్రయాణికులు గడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజయిజా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం నుంచి గాయపడిన వాళ్లకు చికిత్స అందించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వాళ్ల పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు వెల్లడించారు. మరికొందరికి స్వల్పగాయాలు అయినట్లు తెలిపింది. అయితే సిబ్బంది మాత్రం కుదుపులను పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేశామని చెబుతోంది. ఘటన జరిగిన సమయంలో 271 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. విమానంలో చెల్లాచెదురైన విమానం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Video Credits: New York Post -
378 మంది ప్రాణాలు గాల్లో కలిసేవి..!
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. ఆదివారం లండన్ నుంచి మలేషియాకు వెళ్తున్న ఎమ్హెచ్1 విమానం, బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో భారీ కుదుపులకు లోనైంది. సుమారు రెండు నిమిషాల పాటు విమానం అల్లకల్లోలం సృష్టించడంతో అందులో ప్రయాణిస్తున్న 378 మంది ప్రయాణికులకు ప్రాణాలు గాల్లోనే పోయినంతపనైంది. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడటంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇళ్లకు చేరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆ ఫ్లైట్‌లో తల్లిదండ్రులతో పాటు ప్రయాణించిన హరీత్ అనే 13 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై హరీత్ మీడియాతో మాట్లాడుతూ.. విమాన భారీ కుదుపులతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపాడు. ప్రయాణికులు అటూ ఇటూ విసిరేసినట్లుగా అయ్యారని, రెండు నిమిషాల అనంతరం సాధారణ స్థితికి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారని తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన వారికి విమానం కౌలాలంపూర్ చేరుకోగానే చికిత్స అందించారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో ఎమ్హెచ్ 370 విమాన ప్రమాదంలో 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతైన విషయం తెలిసిందే.