దళితులకు చంద్రబాబు ద్రోహం
తూర్పుదిగవల్లి(నూజివీడు రూరల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితవాడలోఅంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. తొలుత రమణక్కపేట అడ్డ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి తొలుత పూల మాల వేసి నివాళులర్పించారు. మేరుగ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటించారని పేర్కొన్నారు. టీడీపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. మహానేత ఆశయాలు నెరవేరాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోçßæన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రిజర్వేషన్లు అంబేడ్కర్ కృషి ఫలితామేనని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని పేర్కొన్నారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించవద్దన్నారు. విగ్రహవిష్కరణ అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో నూజివీడు, చాట్రాయి జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పల్లె రవీంద్రరెడ్డి, కోటగిరి గోపాల్, కలగర వెంకటేశ్వరరావు, సర్పంచి నక్కనబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు ప్రతాప్ పాల్గొన్నారు.