Twenty20 World Cup
-
ఓవర్ ఓవర్‌కూ బెట్టింగ్
అనంతపురం : అనంతపురం సహా రూరల్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 18 మం దిని పోలీసులు అనంతపురం టూ టౌన్, రూర ల్ పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ విలేకరులతో మాట్లాడుతూ... అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికి చెందిన కృష్ణారెడ్డి, కాటిగానికాలువకు చెందిన నల్లపరెడ్డి, రాప్తాడు మండలం మరూరుకు చెందిన అంజనరెడ్డి, అనంతపురం వేణుగోపాల్‌నగర్‌కు చెం దిన అశోక్‌రెడ్డి, రామ్‌నగర్‌కు చెందిన భరత్, రుద్రంపేటకు చెందిన మహబూబ్‌బాషా, కేశవరెడ్డి కలసి జీసస్‌నగర్‌లోని ఓ గది ని అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ టీవీ పెట్టి టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ను చూస్తూ ఫోన్లలో బెట్టింగ్ ఆడుతున్నారు. తనకు అందిన ముందస్తు సమాచారం మేరకు టూటౌన్ సీఐ శుభకుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారన్నారు. ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 30,700 నగదు, 8 సెల్ఫోన్లు, ఒక టీవీ, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న మరో 11 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యా చ్ల్లో బెట్టింగులకు పాల్పడుతున్న రాచానపల్లి, సిండికేట్‌నగర్, కొడిమి గ్రామాలకు చెందిన 11 మంది పట్టుబడిన వారిలో ఉన్నారు. కుమారుడి అరెస్టుతో ఆగిన తండ్రి గుండె? రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన 11 మంది బెట్టింగ్‌రాయుళ్లలో ఓ యువకుడి తండ్రి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. గురువారం రాత్రి పోలీసులు తమ కుమారుడిని పట్టుకెళ్లినట్లు తెలియగానే తీవ్ర ఆందోళనకు గురైన ఆ తండ్రి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ సీఐ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా... తాము ఎవర్నీ ఇంటివద్దకు వెళ్లి పట్టుకోలేదని, బెట్టింగ్ ఆడేందుకు బుకీలతో ఫోన్లో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. తాము పట్టుకున్న సంగతి వారి ఇళ్లలో తెలీదన్నారు. -
బెట్టింగ్ హీట్
► టీ-20 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్ ► ‘అనంత’తో పాటు ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరిలో సబ్ బుకీలు ► బుకీలతో సంబంధం లేకుండానూ...భారీగా వడ్డీలు పెంచిన ‘కాల్‌మనీ’ వ్యాపారులు ► దృష్టిసారించని పోలీసులు టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరి సొంతం? ఈ బాల్‌కు సిక్స్ కొడతాడా.. లేదా? ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి?...సాయంత్రమయితే చాలు బెట్టింగ్ రాయుళ్ల మధ్య జరిగే సంభాషణలివి. టీ-20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరందుకుంటోంది. బుకీల అండతో నడిచే సబ్‌బుకీలతో పాటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగినా ‘అనంత’లో రూ. 1.5-2కోట్ల దాకా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారు కూడా ‘అనంత’లో మకాం వే స్తున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) టీ-20 ప్రపంచ కప్ ఈ నెల 15 నుంచి మొదలైంది. అన్ని జట్లు మంచి ఫాంలో ఉండటంతో ప్రతిమ్యాచ్ బిగ్‌ఫైట్‌ను తలపిస్తోంది. ఇదే బెట్టింగ్ రాయుళ్లకు అనువుగా మారింది. క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ‘అనంత’కు మారిన బెట్టింగ్ కేంద్రం రాయలసీమలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ఎక్కువగా సాగేది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడం, ఏళ్ల తరబడి అరెస్టులు, కౌన్సెలింగ్‌ల నేపథ్యంలో గతంతో పోలిస్తే అక్కడ బెట్టింగ్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బుకీలు ప్రొద్దుటూరుపై కాస్త ఫోకస్ తగ్గించి అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో బుకీలు ఉంటారు. వారు ఇక్కడ సబ్‌బుకీలను నియమించారు. వీరు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకూ బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ధారిస్తారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగ్ ద్వారాజిల్లాలో రోజూ రూ.1.50-2కోట్లు చేతులు మారుతోంది. ఇటీవల ఇండియా-పాకిస్థాన్, ఇంగ్లండ్- సౌతాఫ్రికా మ్యాచ్‌ల సమయంలో రూ.5కోట్ల దాకా బెట్టింగ్ జరిగి ఉంటుందని ఓ అంచనా. బాల్ టు బాల్ బెట్టింగ్ సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్ లేక ఫోర్ కొడతాడా? బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతిబాల్కు బెట్టింగ్ జరుగుతోంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బంతులపై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలను వేదికగా చేసుకుంటున్నారు. భారీ వడ్డీలకు అప్పులు ఈ మాయలో పడిన కొందరు బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీకి డబ్బు తెస్తున్నారు. ఇంకొందరు రూ.పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లు చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ‘అనంత’ పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రపంచకప్ ముందు బెట్టింగ్‌పై ఎస్పీ రాజశేఖరబాబు ఆరా తీయగా.. ‘అబ్బే అనంతలో అంత లేదు సార్’ అని కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎస్పీ దృష్టి సారిస్తేనే బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించవచ్చు. -
'ఆ రెండు క్యాచ్ లు కొంపముంచాయి'
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. అయితే తమ జట్టు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలే ఓటమికి కారణాలుగా మారుతున్నాయని ఆ జట్టు కెప్టెన్ ముష్రాఫే మొర్తజా పేర్కొన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. షేన్ వాట్సన్, జాన్ హెస్టింగ్స్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా విజయం తమ జట్టుదేనని బంగ్లా కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసినా, ఫీల్డింగ్ లోపాల వల్ల ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యామని మొర్తజా అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు కాస్త త్వరగా రాణించి వికెట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చాడు. చివర్లో బౌలర్లు రాణించడంతో ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగామని చెప్పాడు. బంగ్లా జట్టు బుధవారం తమ తదుపరి పోరులో పటిష్ట భారత్ తో తలపడనుందని తెలిపాడు. ఆసీస్ తో మ్యాచ్ లో ఓడినప్పటికీ తమ ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగిందని మొర్తజా వివరించాడు. -
భారత్-పాక్ మ్యాచ్‌కో ప్రత్యేకత
కోల్‌కతా: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెల 19 కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే దాయాదుల పోరుకు ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం ఆలపించనున్నారు. క్రికెట్ మ్యాచ్‌కు ముందుగా ఇరు దేశాల జాతీయ గీతాలను పాడటం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా మ్యాచ్‌లో అమితాబ్ భారత జాతీయ గీతాన్ని, పాక్ శాస్త్రీయ గాయకుడు షఫాఖత్ అమానత్ అలీ ఆ దేశ జాతీయ గీతాన్ని పాడనున్నారు. ఈ మ్యాచ్‌కు హాజరయ్యే విషయాన్ని అమితాబ్ ధ్రువీకరించారు. 'భారత్-పాక్ మ్యాచ్ రోజు సీనియర్ బచ్చన్ జాతీయ గీతాన్ని పాడుతారు' అని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక పాక్ గాయకుడు అలీ రాక విషయాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం ధ్రువీకరించింది. -
కిం కర్తవ్యం!
♦ తలనొప్పిగా మారిన బౌలర్లు ♦ అయోమయంలో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ భారీస్కోర్లు చేసినా ఒక్కటి కూడా గెలవకపోవడం కచ్చితంగా ఏ జట్టునైనా నైరాశ్యంలోకి నెడుతుంది. భారత్ కూడా దీనికి అతీతం కాదు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోనే ఇంతకంటే ప్లాట్ వికెట్లపై ఎదురైన ప్రతి జట్టునూ ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోతున్నారు. టి20 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్ గురించి ఆలోచిస్తే... ఒక్క ధోనికే కాదు, భారత సెలక్టర్లకు కూడా ఈ సిరీస్‌లో బౌలర్ల ప్రదర్శన ఓ పెద్ద తలనొప్పి. సాక్షి క్రీడావిభాగం ‘మేం అదనంగా మరో 30 పరుగులు చేయడం... లేదా టాస్ గెలిచినా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ ఇచ్చి ఛేజ్ చేయడం. ఈ రెండూ మినహా నా దగ్గర ప్రత్యామ్నాయం లేదు’... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు స్కోర్లు చేసి ఓడిపోయిన తర్వాత ధోని నిర్వేదం ఇది. భారత బలహీనతను గమనించిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో టాస్ గెలిచినా భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చి మరోసారి లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. బౌలర్ల అనుభవలేమి తమ ఓటమికి ప్రధాన కారణంగా ధోని చెప్పుకొచ్చాడు. కానీ ఉమేశ్, ఇషాంత్ కలిసి 133 వన్డేలు ఆడారు. ఇషాంత్ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఇక ఉమేశ్ యాదవ్ మూడు ప్రధాన సిరీస్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాలో పేసర్లకు ఎంతో కొంత సహకారం లభించే పిచ్‌లపై ఈ అనుభవం సరిపోదని అనుకోలేం. అశ్విన్ గత ఏడాది కాలంగా భారత జట్టు తరఫున అన్ని దేశాల్లోనూ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడో వన్డే నాటికి అతను తుది జట్టులో స్థానమే కోల్పోయాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు ఏ పిచ్‌ల మీద అయినా రాణించాలి. గతంలో కుంబ్లే, హర్భజన్లు ఇవే పిచ్‌ల మీద వికెట్లు తీసిన విషయం మరువ కూడదు. అదే సమయంలో అశ్విన్ కూడా ఇదే ఆస్ట్రేలియాలో ఏడాది క్రితమే స్ట్రయిక్ బౌలర్‌గా వికెట్లు తీసిన సంగతీ మరువలేం. నిజానికి అనుభవలేమి కంటే... క్రమశిక్షణ లేకపోవడం భారత బౌలర్ల ప్రధాన సమస్య. షమీ లేకపోవడం లోటు ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. గత ఏడాది ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన షమీ... అప్పటి నుంచి గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేడు. తాజాగా ఈ సిరీస్‌కు ముందు కోలుకుని జట్టులోకి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు తొలి మ్యాచ్‌కు ముందే ప్రాక్టీస్‌లోనే గాయపడ్డాడు. ధోని చెప్పిన మాటలనే తీసుకుంటే షమీకి కూడా పెద్దగా అనుభవం లేదు. కానీ మంచి వేగంతో బంతుల్లో వైవిధ్యం చూపగల సత్తా ఉంది. ఉమేశ్ కూడా తన వేగంతో ప్రత్యర్థిని భయపెట్టాలి. కానీ లైన్ సరిగా లేక దెబ్బతిన్నాడు. కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే కాళ్ల మీదకు రెండు బంతులు వేసి రెండు బౌండరీలు ఇస్తే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడు. ఫీల్డింగ్ సెట్ చేసిన విధానానికి అనుగుణంగా బంతులు వేయాలనే ప్రాథమిక అంశాన్ని భారత బౌలర్లు ఈ వన్డే సిరీస్‌లో మరచిపోయారు. టి20 ప్రపంచకప్‌లో పరిస్థితి? మరో రెండు నెలల్లో భారత్ స్వదేశంలో టి20 ప్రపంచకప్ ఆడబోతోంది. నిజానికి దీనిని దృష్టిలో ఉంచుకునే జట్టులో పలు మార్పులు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఇంకా ఆస్ట్రేలియాలో టి20లు ఆడకపోయినా... అందులో కూడా ఇంతకంటే భిన్నమైన ప్రదర్శనను ఆశించలేం. అయితే స్వదేశంలో భారత బౌలర్లు బాగా రాణిస్తారనేది ఒక అంచనా. అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై కచ్చితంగా ప్రభావం చూపగలరు. కానీ స్వదేశంలో అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20ల ఫలితం తలచుకుంటే ఆందోళన పెరగడం ఖాయం. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ చిత్తుగా ఓడిపోయింది. ధర్మశాలలో 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా ఓడిపోయారు. భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్, అశ్విన్... ఇలా భారత ప్రధాన బౌలర్లు, ఐపీఎల్లో చెలరేగిపోయే స్టార్స్ అంతా ఆ మ్యాచ్ ఆడారు. కానీ సఫారీలను నిలువరించలేకపోయారు. ప్రస్తుతం టి20 ఫార్మాట్లో అన్ని జట్లలోనూ భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లు ఆ మెగా టోర్నీకి జట్టు ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు సహకరించే వికెట్లపై ప్రభావం చూపలేకపోయిన సీమర్లందరి విషయంలోనూ పునరాలోచన చేయాలేమో..! భవిష్యత్ గురించి ఆలోచన స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓడిపోవడం, తాజాగా ఆస్ట్రేలియాలో ప్రదర్శన తర్వాత కచ్చితంగా భవిష్యత్‌కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. బరిందర్ శరణ్ లాంటి యువ బౌలర్‌కు కెరీర్లో ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లు రావడం ద్వారా మంచి ఆరంభం లభించింది. కానీ ఆ ఆత్మవిశ్వాసం తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అతను చూపించలేదు. అయినా వేగంగా బంతులు వేయగల ఇలాంటి క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడేలా తయారు చేసుకోవాలి. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్లో ఫ్లాట్ పిచ్‌లపై కూడా రాణిస్తున్న సీమర్లకు మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. అంటే భారత్ ‘ఎ’ జట్టుకు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి, రాహుల్ ద్రవిడ్ లాంటి అనుభవజ్ఞుడికి వీరిని సాన బెట్టేందుకు అప్పగించాలి. ఇప్పుడే కోలుకుని భవిష్యత్ గురించి ప్రణాళికలు రచించకపోతే... మనోళ్లు కేవలం ఐపీఎల్ స్టార్స్‌గా మాత్రమే మిగిలిపోతారు. -
చెన్నైలో ప్రపంచకప్ టి20 మ్యాచ్‌లు లేనట్టే!
చెన్నై: స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి. కార్పొరేషన్‌తో వివాదం కారణంగా వీటిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ ఖాళీ స్టాండ్స్ కారణంగా టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లను చెన్నై కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్‌లను నిర్వహించేది లేదని ఐసీసీ తెగేసి చెప్పింది.