కోల్కతా: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెల 19 కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగే దాయాదుల పోరుకు ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం ఆలపించనున్నారు.
క్రికెట్ మ్యాచ్కు ముందుగా ఇరు దేశాల జాతీయ గీతాలను పాడటం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. కోల్కతా మ్యాచ్లో అమితాబ్ భారత జాతీయ గీతాన్ని, పాక్ శాస్త్రీయ గాయకుడు షఫాఖత్ అమానత్ అలీ ఆ దేశ జాతీయ గీతాన్ని పాడనున్నారు. ఈ మ్యాచ్కు హాజరయ్యే విషయాన్ని అమితాబ్ ధ్రువీకరించారు. 'భారత్-పాక్ మ్యాచ్ రోజు సీనియర్ బచ్చన్ జాతీయ గీతాన్ని పాడుతారు' అని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక పాక్ గాయకుడు అలీ రాక విషయాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం ధ్రువీకరించింది.
భారత్-పాక్ మ్యాచ్కో ప్రత్యేకత
Published Wed, Mar 16 2016 8:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement