'అమితాబ్ పారితోషికం తీసుకోలేదు' | big B didn't charge fee for singing anthem, says CAB | Sakshi
Sakshi News home page

'అమితాబ్ పారితోషికం తీసుకోలేదు'

Published Sun, Mar 20 2016 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

'అమితాబ్ పారితోషికం తీసుకోలేదు'

'అమితాబ్ పారితోషికం తీసుకోలేదు'

కోల్కతా:పాకిస్తాన్తో శనివారం ఈడెన్ గార్డెన్లో భారత్తో జరిగిన వరల్డ్ టీ 20 మ్యాచ్లో భాగంగా జాతీయ గీతాన్ని ఆలపించిన బిగ్  బి అమితాబ్ బచ్చన్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) తాజాగా స్పష్టం చేసింది. తమ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి ఆయన స్వచ్ఛందంగానే  హాజరైనట్లు పేర్కొంది.


ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు జరిగిన జాతీయ గీత ఆలాపన కార్యక్రమానికి హాజరైన బిగ్ బి రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్యాబ్ సీనియర్ అధికారి స్పందిస్తూ.. బిగ్ బి అమితాబ్ కు తాము ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.  చివరకు అమితాబ్ విమాన టికెట్లతో పాటు, హోటళ్ల బిల్లుల విషయంలో కూడా ఆయన తన సొంత నగదునే ఖర్చు పెట్టినట్లు  ఈ సందర్భంగా క్యాబ్ అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement