ఓవర్ ఓవర్‌కూ బెట్టింగ్
అనంతపురం : అనంతపురం సహా రూరల్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 18 మం దిని పోలీసులు అనంతపురం టూ టౌన్, రూర ల్ పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ విలేకరులతో మాట్లాడుతూ... అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికి చెందిన కృష్ణారెడ్డి, కాటిగానికాలువకు చెందిన నల్లపరెడ్డి, రాప్తాడు మండలం మరూరుకు చెందిన అంజనరెడ్డి, అనంతపురం వేణుగోపాల్‌నగర్‌కు చెం దిన అశోక్‌రెడ్డి, రామ్‌నగర్‌కు చెందిన భరత్, రుద్రంపేటకు చెందిన మహబూబ్‌బాషా, కేశవరెడ్డి కలసి జీసస్‌నగర్‌లోని ఓ గది ని అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ టీవీ పెట్టి టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ను చూస్తూ ఫోన్లలో బెట్టింగ్ ఆడుతున్నారు. తనకు అందిన ముందస్తు సమాచారం మేరకు టూటౌన్ సీఐ శుభకుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారన్నారు.
ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 30,700 నగదు, 8 సెల్‌ఫోన్లు, ఒక టీవీ, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న మరో 11 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యా చ్‌ల్లో బెట్టింగులకు పాల్పడుతున్న రాచానపల్లి, సిండికేట్‌నగర్, కొడిమి గ్రామాలకు చెందిన 11 మంది పట్టుబడిన వారిలో ఉన్నారు.
కుమారుడి అరెస్టుతో ఆగిన తండ్రి గుండె?
రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన 11 మంది బెట్టింగ్‌రాయుళ్లలో ఓ యువకుడి తండ్రి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. గురువారం రాత్రి పోలీసులు తమ కుమారుడిని పట్టుకెళ్లినట్లు తెలియగానే తీవ్ర ఆందోళనకు గురైన ఆ తండ్రి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ సీఐ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా... తాము ఎవర్నీ ఇంటివద్దకు వెళ్లి పట్టుకోలేదని, బెట్టింగ్ ఆడేందుకు బుకీలతో ఫోన్‌లో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. తాము పట్టుకున్న సంగతి వారి ఇళ్లలో తెలీదన్నారు.