ముగ్గురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | The arrest of the three cricket betting rayulla | Sakshi
Sakshi News home page

ముగ్గురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

Published Wed, Sep 28 2016 10:08 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

ముగ్గురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ - Sakshi

ముగ్గురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

–  రూ.10వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం
బద్వేలుఅర్బన్‌: పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో బుధవారం ముగ్గురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టుచేసి రూ.10వేల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామాంజినాయక్‌ తెలిపారు. ఈ మేరకు స్థానిక అర్బన్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ  తమకు వచ్చిన సమాచారం మేరకు అర్బన్‌ఎస్‌ఐ నూర్‌ అహ్మద్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది మార్కెట్‌యార్డు సమీపంలోకి వెళ్లగా అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారని,  వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్నట్లు తేలిందన్నారు. బి.మఠం మండలం చౌదరివారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డితో పాటు కడప రవీంద్రనగర్‌కు చెందిన సానం కొండారెడ్డి, ముతుకూరు దయానందరెడ్డిలను అరెస్టు చేశామన్నారు. సమావేశంలో రూరల్‌ఎస్‌ఐ నరసింహారెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు నరసింహామూర్తి, దాదావల్లి, కానిస్టేబుళ్లు చెన్నారెడ్డి, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement