‘రెండాకులు’ మూయాల్సిందే
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలపై ముద్రించిన ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలు, అన్నాడీఎంకే చిహ్నమైన రెండాకులు పోలిన బొమ్మలను తొలగించడమో లేక కప్పి ఉంచడమో చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మినీ బస్సులపై ఉన్న బొమ్మలపై ‘రెండాకులు’ మూయాల్సిందే తమ వివరణను కోరకుండా ఎన్నికల కమిషన్ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత పేర్కొన్నారు.
కోర్టులో వాదోపవాదాలు సాగుతుండడంతో మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని పోలిన నాలుగు ఆకుల బొమ్మలు అలాగే ఉన్నారుు. దీనిపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా ఆకుల బొమ్మలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే తరపున సీనియర్ న్యాయవాది రాజేంద్రన్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ విచారణ జరిగింది.
మినీ బస్సులపై ముద్రించిన రెండాకులు అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కాకున్నా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈసీ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగ్నిహోత్రి, న్యాయమూర్తి ఎంఎం సుందరేష్ ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ వెంటనే బస్సులపై ఉన్న ఆకుల బొమ్మలను కప్పి ఉంచాలని ఆదేశించారు. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగిన పిటిషన్ల పోరులో డీఎంకే కోశాధికారి స్టాలిన్దే పైచేయిగా నిలవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
చైతన్య ప్రచారాలు
ఇదిలా ఉండగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ మంగళవారం నుంచి చైతన్య ప్రచారాలు చేపట్టింది. ఆటోల ద్వారా కరపత్రాలను, సీడీలను పంచుతూ ఓటర్లను చైతన్య పరుస్తోంది. ఁఓటు మీ జన్మహక్కు, బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, దేశం బలహీనం కాకుండా కాపాడుకోవాలిరూ అంటూ కరపత్రాల్లో సూచించారు. ఁఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలో మీ ఓటు నిర్ణయిస్తుందిరూ అంటూ వివరించారు.