ఇంజిన్లకు కిక్!
- ఆల్కహాల్‌తో ప్రత్యామ్నాయ ఇంధనం
- ‘విశాఖ’ విద్యార్థుల వినూత్న ప్రయోగం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఆల్కహాల్‌తో వాహనాలను నడపవచ్చంటున్నారు విశాఖ జిల్లా నరవలోని విశాఖ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు. ఇటీవల కోర్సు పూర్తిచేసిన బీటెక్ మెకానికల్ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఒక ద్విచక్ర వాహనం ఇంజిన్‌ను తీసుకుని దానిని పనిచేయించేందుకు ఇథనాల్ (ఈథైల్ ఆల్కహాల్)ను ఉపయోగించి విజయం సాధించారు. ప్రస్తు తం ఉపయోగిస్తున్న పెట్రోల్‌కు బదులుగా ఇథనాల్‌ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
మెకానికల్ విభాగాధిపతి జి.శివకరుణ, ప్రిన్సిపాల్ సరోజ్‌కుమార్ పాఢి సారథ్యంలో విద్యార్థులు లోకేష్, బాలకృష్ణ, విశ్వాస్, శివకృష్ణ, గంగాధర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పెట్రోల్‌తో 69 కిలోమీటర్లు నడిచే ఒక ద్విచక్ర వాహనం ఇంజిన్‌ను తీసుకుని ఇథనాల్ ఆల్కహాల్‌ను ప్రయోగించారు. దీని ద్వారా మైలేజి 90 కిలోమీటర్లకు పెరిగింది. కాలుష్యం 50 శాతానికి తగ్గింది. ఇథనాల్‌ను ఉపయోగించడంవల్ల ఇంజిన్ పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.