పాదచారులపైకి దూసుకెళ్లిన కారు
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు... రహదారి వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి కారు డ్రైవర్‌ను పట్టుకుని... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.