Two young women
-
ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
హైదరాబాద్‌లో ఒక మహిళ, ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్(అబ్దుల్లాపూర్‌మెట్): వేర్వేరు చోట్ల ఓ మహిళ, యువతి అదృశ్యమయ్యారు. ఈ సంఘటనలు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. తారమతిపేటకు చెందిన రక్షిత(19) ఈ నెల 11న ఉదయం మహంకాళీ దేవాలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆచూకీ కోసం గ్రామంతో పాటు బంధువుల ఇళ్లలో వాకబు చేయగా జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో చోట మహిళ .. మండలంలోని కవాడిపల్లికి చెందిన గృహిణి (30) ఈ నెల 12న ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్యాంక్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పహాడీషరీఫ్‌లో యువతి.. పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటయ్య ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడిపల్లిలో నివాసం ఉండే కంట్రోత్ సంధ్య దగ్గరకు ఆమె అక్క కుమార్తె బడావత్ మంజుల (19) ఐదు నెలల క్రితం వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఈ నెల 5న ఉదయం డ్యూటీకి వెళ్లిన మంజుల సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. స్వాతి, మహేశ్వరి, మంజుల (ఫైల్ ఫొటోలు) -
మేము ఎవరికీ భారం కాకూడదు!
హయత్‌నగర్: ‘మాకు పెళ్లిళ్లు చేయడం వల్ల మీరు అప్పుల పాలు కాకూడదు. మా కారణంగా మీరు గొడవలు పడొద్దు. చావడం తప్పే.. మా చావు కారణంగా ఎన్నో పుకార్లు పుట్టుకొస్తాయి. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అయినా చావాలనుకుని చస్తున్నాం’అంటూ సూసైడ్ నోటు రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన బాషం నారాయణ, నారాయణమ్మ దంపతులు.. కుమార్తె గౌతమి(20)తో కలసి హయత్‌నగర్ డివిజన్లోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పోత్నపల్లికి చెందిన రాములు, తిరుపతమ్మ దంపతులు.. కుమార్తె మమత(20)తో కలసి రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు గతంలో శ్రీనివాసకాలనీలో పక్కపక్కనే నివాసముండటం వల్ల గౌతమి, మమతల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇంటర్ వరకు చదివారు. మమత ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుండగా, గౌతమి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. శుక్రవారం మమత తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లగా, తమ్ముడు పాఠశాలకు వెళ్లాడు. గౌతమి మమత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో మమత తమ్ముడు ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ భారం కాకూడదని.... నా పెళ్లితో తమ్ముడి చదువు ఆగిపోకూడదంటూ మమత... నాన్నా నా చావుతో అయినా నీవు ప్రశాంతంగా ఉండు. అమ్మను బాధ పెట్టకు అని గౌతమి.. ఇరువురు వేర్వేరుగా సూసైడ్ నోట్ రాశారు. ‘మమ్మల్ని క్షమించండి. మా చావుకు ఎవరూ కారణం కాదు. మేము ఎవరికీ భారం కాకూడదు. మా పెళ్లిళ్ల కోసం మీరు అప్పులపాలు కావద్దు. మా ఆత్మహత్యకు అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. ఎలాంటి తప్పు చేయలేదు. మా చావుతో ఇరు కుటుంబాల వారు ఎలాంటి గొడవలకు దిగరాదు’అంటూ ఇద్దరు కలసి మరో సూసైడ్ నోటు రాశారు. -
పోలీస్‌స్టేషన్‌కు చేరిన సింధు - శిరీషల ప్రేమాయణం
⇒ మేమిద్దరం కలిసే జీవిస్తాం ⇒ వెల్లడించిన ఇద్దరు యువతులు కమాన్‌పూర్(మంథని): కొద్దినెలలుగా చర్చనీయాంశంగా మారిన ఇద్దరి యువతుల ప్రేమాయణం వ్యవహారం కమాన్‌పూర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. ఆరునెలలు దూరం ఉంటామని అంగీకరించిన వారిద్దరూ రెండునెలలు గడవకముందే ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు. తమను విడదీయొద్దని..ఒకరిని విడిచి ఉండలేమంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శిరీష, సింధు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన దాసరి శిరీష. రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన గుర్రాల సింధు ఓ పాఠశాలలో నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో సింధు, శిరీషలకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారు ఇంట్లో చెప్పకుండానే గడపదాటారు. ఈ క్రమంలోనే ఓ తెలుగు చానల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము ఇద్దరం మహిళలమైనా కలిసి బతకాలనుకుంటున్నాంమని చెప్పారు. అయితే ఇది ప్రకృతికి విరుద్ధమని, ఆరు నెలలు విడిగా ఉంటే మార్పు వస్తుందని నిర్వాహకులు సూచించడంతో ఒప్పుకున్నారు. రెండునెలలు దూరంగా ఉన్న వీరు మరోసారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శిరీష తండ్రి శంకర్ తన కూతురు కనిపించడంలేదని గతనెల10న కమాన్‌పూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శిరీష సెంటినరీకాలనీకి చెందిన సింధూతో వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సింధూ, శిరీష ఆచూకీ కోసం పోలీసులు గాలించగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాలలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం తెలుసుకొని తీసుకొవచ్చారు. యువతులిద్దరూ తాము కలిసే జీవిస్తామని, విడదీయొద్దంటూ పోలీసులకు విన్నవించుకున్నారు. వారు మేజర్లు కావడంతో విచారించి అవసరమైన సమయంలో మళ్లీ పిలిస్తే రావాలని సూచించారు. అందుకు వారు అంగీకారం తెలిపి ఠాణానుంచి వెళ్లిపోయారు. దీంతో కొద్ది నెలలుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్న ఈ ఇద్దరి యువతుల ప్రేమ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది. -
ఆటో డ్రైవర్ వికృత చేష్టలు
భయంతో నడుస్తున్న ఆటోలోంచి దూకేసిన ఇద్దరు యువతులు సాక్షి, ముంబై: డ్రైవర్ అశ్లీల సైగలతో భయపడిన ఇద్దరు యువతులు నడుస్తున్న ఆటోలోంచి దూకేసిన సంఘటన ఆదివారం రాత్రి ఠాణేలో చోటుచేసుకుంది. యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కోసం వర్తక్‌నగర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గాయపడిన ఇద్దరు యువతులు ఠాణేలోని జూపిటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రత్నగిరి నుంచి వచ్చిన ప్రతీక్ష పురాణిక్ (17), సారిక పాటిల్ (21) ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఠాణేలో రైలు దిగారు. భివండీలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కొద్ది దూరం వెళ్లగానే ఆటో డ్రైవర్ అద్దంలో వారి వంక చూస్తూ అశ్లీల సైగలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతులు ఆటో ఆపాలని చెప్పినా ఆపకుండా ముందుకు వెళ్లసాగాడు. ఆటో హైవేపై ఉండటంతో వేగాన్ని పెంచాడు. దీంతో భయపడిన ఇరువురు దిక్కు తోచక వేగంగా వెళుతున్న ఆటోలోంచి దూకేశారు. అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న ఓ మహిళ గాయపడ్డ వీరిని గమనించి ఆస్పత్రిలో చేర్పించింది. గతేడాది ఆగస్టు 1న విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సప్నాలి లాడ్ కూడా ఇలాగే నడుస్తున్న ఆటోలోంచి దూకేసింది. తీవ్రగాయాలతో 21 రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన కూడా ఠాణేలోనే జరిగింది. అంతకు ముందు విజయవాడ నుంచి వచ్చిన ఎస్తేర్ అనూహ్య కూడా దారుణ హత్యకు గురయ్యింది. అప్పుడు ఈ రెండు ఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. ఇవి మర్చిపోక ముందే ఇప్పుడు మరో సంఘటన జరగటంతో ముంబై వాసుల ఆటో ఎక్కాలంటేనే బెంబేలెత్తుతున్నారు. -
ప్రేమించారు.. వదిలించుకోవాలనుకున్నారు
జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం తెలకపల్లి : ప్రేమించారు.. పెద్దలను ఎదురించి పెళ్లికూడా చేసుకుంటామని నమ్మబలికారు.. చివరికి నిరాకరించడంతో మోసపోయామని అర్థం చేసుకొని ఆ ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలిలా.. తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన సముద్ర అనే యువతితో అదే గ్రామానికి చెందిన సలేశ్వరంతో నాలుగు నెలలకిందట పరిచయం ఏర్పడింది. చివరికి అది ప్రేమకు దారితీయగా సలేశ్వరం యువతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటీవల యువతి వివాహం చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదిలావుండగా ఈ సంఘటనను కారణంగా చూపుతూ సముద్ర తండ్రి అశ్వయ్య తన బంధువులతో కలిసి సలేశ్వరాన్ని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ షేక్షఫి తెలిపారు. కోస్గి : మండల పరిధిలోని హన్మాన్పల్లికి చెందిన చంద్రయ్య, బుజ్జమ్మల కూతురు మౌనిక,ఆర్మీలో పని చేసే దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌కు చెందిన సాయి అనే యువకులిద్దరు కొన్నేళ్లు గా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న సాయి జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఈనెల 7న ఆదివారం సెలవుపై వచ్చాడు. అంతా సిద్ధమైన తర్వాత పెళ్లి కూతురు జిల్లా కేంద్రానికి వెళ్లి ఫోన్ చేయగా ఇంట్లో వారు వద్దంటున్నారని, నేను చేసుకోనని నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక సోమవారం ఉద యం స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.