జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం
తెలకపల్లి : ప్రేమించారు.. పెద్దలను ఎదురించి పెళ్లికూడా చేసుకుంటామని నమ్మబలికారు.. చివరికి నిరాకరించడంతో మోసపోయామని అర్థం చేసుకొని ఆ ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలిలా.. తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన సముద్ర అనే యువతితో అదే గ్రామానికి చెందిన సలేశ్వరంతో నాలుగు నెలలకిందట పరిచయం ఏర్పడింది.
చివరికి అది ప్రేమకు దారితీయగా సలేశ్వరం యువతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటీవల యువతి వివాహం చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదిలావుండగా ఈ సంఘటనను కారణంగా చూపుతూ సముద్ర తండ్రి అశ్వయ్య తన బంధువులతో కలిసి సలేశ్వరాన్ని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ షేక్‌షఫి తెలిపారు.
కోస్గి : మండల పరిధిలోని హన్మాన్‌పల్లికి చెందిన చంద్రయ్య, బుజ్జమ్మల కూతురు మౌనిక,ఆర్మీలో పని చేసే దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌కు చెందిన సాయి అనే యువకులిద్దరు కొన్నేళ్లు గా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న సాయి జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఈనెల 7న ఆదివారం సెలవుపై వచ్చాడు.
అంతా సిద్ధమైన తర్వాత పెళ్లి కూతురు జిల్లా కేంద్రానికి వెళ్లి ఫోన్ చేయగా ఇంట్లో వారు వద్దంటున్నారని, నేను చేసుకోనని నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక సోమవారం ఉద యం స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రేమించారు.. వదిలించుకోవాలనుకున్నారు
Published Tue, Dec 9 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement