udayagiri district
-
రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర
సాక్షి, ఉదయగిరి: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి సోదరులకు ప్రత్యేక స్థానం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయస్థాయిలో రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ముగ్గురూ ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1983లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన అదే ఏడాది కాంగ్రెస్ తరపున ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. 1985లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1989లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. 2009, 2012, 2014లో నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహించారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించారు. పెద్దిరెడ్డిపల్లి, సీతారాంసాగర్ రిజర్వాయర్లు సాధించి వైఎస్సార్ చేతులమీదుగా శంకుస్థాపన చేయించారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి ఆయన పక్షాన నిలిచారు. జిల్లాలో అనేక రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొని జగన్‌తోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ నిర్ణయం మేరకు రెండుసార్లు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ తరపున పార్లమెంటులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీలో రాష్ట్రస్థాయి కీలకనేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు. సోదరుడు.. తనయుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా జిల్లా, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు రికార్డుస్థాయిలో మెజారిటీ తీర్పు ఇచ్చారు. అలాగే ఉదయగిరి నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తమ్మీద మేకపాటి కుటుంబం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. -
ఉదయగిరి.. నా వల్ల కాదు!
ఉదయగిరి, న్యూస్‌లైన్: ఉదయగిరి నుంచి పోటీ చేసేందుకు బొల్లినేని వెంకటరామారావు వెనుకంజ వేస్తున్నారా..! ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించారా..! ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి అవకాశం ఇవ్వాలని కోరారా..! లేక ఏ ప్రాంతం నుంచీ పోటీచేయడానికి సుముఖంగా లేరా..! ఈ మేరకు రెండు మూడు రోజులుగా టీడీపీ ముఖ్య నేతల మధ్య చర్చ సాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పట్టున్న మేకపాటి కుటుంబాన్ని తట్టుకుని పోటీచేసేందుకు గత ఉప ఎన్నికల సమయంలో ఎవరూ రాకపోవడంతో బొల్లినేనిని అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. అప్పటి వరకు ఆ పార్టీకి అండగా ఉన్న కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బొల్లినేని సుముఖంగా లేనప్పటికీ, పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి బరిలో నిలిచారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఘోరపరాజయం పాలవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పైగా రాష్ట్ర విభజన విషయంలో టీడీపీని సీ మాం ధ్ర ప్రజలు దోషిగా భావిస్తుండటం, ఆ ప్రభావం వచ్చే ఎన్నిక ల్లో పడుతుందనే భయం బొల్లినేనిని వెంటాడుతోంది. వ్యా పార వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గానికి స మయం కేటాయించలేకపోవడం, ఉపఎన్నికల తర్వాత అన్ని గ్రామాలు తిరిగి కనీసం పార్టీ శ్రేణులకు కూడా కృతజ్ఞత చెప్పలేకపోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. మరోైవె పు జోరుగా వీస్తున్న ఫ్యాన్ గాలిని తట్టుకుని నిలబడటం కష్టమ ని, కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదనే భావనకు ఆ యన వచ్చినట్లు తెలిసింది. దీనిపై కొద్ది రోజులుగా మల్లగుల్లా లు పడుతున్నప్పటికీ మూడు రోజుల క్రితం చంద్రబాబు వద్ద మనస్సులో మాటను బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోం ది. దీనిపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బొల్లినేనిని అధినేత వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడినుంచే పోటీ చేస్తే ఓటమిపాలైనా, భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామ ని బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. అయితే బొల్లినేని రామారావు మాత్రం కొత్త వ్యక్తి కోసం ప్రయత్నించుకోవాలని, తాను పోటీ నుంచి విరమించుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కొందరు నేతలు భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుండడం కూడా ఆయన కలత చెందడానికి ఓ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంభం విజయరామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయన భార్య అనుసూయమ్మను బరిలో దించితే ఎలా ఉంటుందనే అంశం కూడా టీడీపీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను బరిలోకి దించితే, ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా రాబట్టవచ్చనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘గిరి’ బరిలో వంటేరు: ఉదయగిరి బరి నుంచి బొల్లినేని తప్పుకుంటే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉం టున్న ఆయన ఇప్పుడు ఆదాలతో కలిసి పార్టీకి దగ్గరయ్యేం దుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తనకు అవకాశం కల్పిస్తే కావలి లేదా ఉదయగిరి నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నం దున వంటేరుకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కంభంను టీడీపీలోకి తీసుకురావాలని ఆదాల ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.