ఉదయగిరి, న్యూస్‌లైన్: ఉదయగిరి నుంచి పోటీ చేసేందుకు బొల్లినేని వెంకటరామారావు వెనుకంజ వేస్తున్నారా..! ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించారా..! ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి అవకాశం ఇవ్వాలని కోరారా..! లేక ఏ ప్రాంతం నుంచీ పోటీచేయడానికి సుముఖంగా లేరా..! ఈ మేరకు రెండు మూడు రోజులుగా టీడీపీ ముఖ్య నేతల మధ్య చర్చ సాగుతోంది.
ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పట్టున్న మేకపాటి కుటుంబాన్ని తట్టుకుని పోటీచేసేందుకు గత ఉప ఎన్నికల సమయంలో ఎవరూ రాకపోవడంతో బొల్లినేనిని అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. అప్పటి వరకు ఆ పార్టీకి అండగా ఉన్న కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బొల్లినేని సుముఖంగా లేనప్పటికీ, పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి బరిలో నిలిచారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఘోరపరాజయం పాలవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పైగా రాష్ట్ర విభజన విషయంలో టీడీపీని సీ మాం ధ్ర ప్రజలు దోషిగా భావిస్తుండటం, ఆ ప్రభావం వచ్చే ఎన్నిక ల్లో పడుతుందనే భయం బొల్లినేనిని వెంటాడుతోంది. వ్యా పార వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గానికి స మయం కేటాయించలేకపోవడం, ఉపఎన్నికల తర్వాత అన్ని గ్రామాలు తిరిగి కనీసం పార్టీ శ్రేణులకు కూడా కృతజ్ఞత చెప్పలేకపోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది.
మరోైవె పు జోరుగా వీస్తున్న ఫ్యాన్ గాలిని తట్టుకుని నిలబడటం కష్టమ ని, కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదనే భావనకు ఆ యన వచ్చినట్లు తెలిసింది. దీనిపై కొద్ది రోజులుగా మల్లగుల్లా లు పడుతున్నప్పటికీ మూడు రోజుల క్రితం చంద్రబాబు వద్ద మనస్సులో మాటను బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోం ది. దీనిపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బొల్లినేనిని అధినేత వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడినుంచే పోటీ చేస్తే ఓటమిపాలైనా, భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామ ని బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. అయితే బొల్లినేని రామారావు మాత్రం కొత్త వ్యక్తి కోసం ప్రయత్నించుకోవాలని, తాను పోటీ నుంచి విరమించుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
నియోజకవర్గంలోని కొందరు నేతలు భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుండడం కూడా ఆయన కలత చెందడానికి ఓ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంభం విజయరామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయన భార్య అనుసూయమ్మను బరిలో దించితే ఎలా ఉంటుందనే అంశం కూడా టీడీపీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను బరిలోకి దించితే, ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా రాబట్టవచ్చనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
‘గిరి’ బరిలో వంటేరు: ఉదయగిరి బరి నుంచి బొల్లినేని తప్పుకుంటే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉం టున్న ఆయన ఇప్పుడు ఆదాలతో కలిసి పార్టీకి దగ్గరయ్యేం దుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తనకు అవకాశం కల్పిస్తే కావలి లేదా ఉదయగిరి నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నం దున వంటేరుకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కంభంను టీడీపీలోకి తీసుకురావాలని ఆదాల ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయగిరి.. నా వల్ల కాదు!
Published Sat, Mar 1 2014 2:40 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement
Advertisement