Uddhav
-
ఎవరి పంతం వారిది!
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం పదవి కోసం బీజేపీ,శివసేన మధ్య ఏర్పడిన పీటముడి బిగుస్తోంది. ఎన్నికలకు ముందు పొత్తు ఏర్పాటైనప్పుడు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పట్టుబడుతున్నారు. దీనిపై తొలిసారి నోరు విప్పిన దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం పార్టీల మధ్య అలాంటి ఒప్పందమేమీ జరగలేదని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. మరో అయిదేళ్లు బీజేపీ నేతృత్వంలో కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బుధవారం కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారని వెల్లడించారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలతో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారం ముంబైకి రానున్నారని దీంతో ముఖ్యమంత్రి పీఠంపై చిక్కు ముడి వీడనుందని భావించారు. అయితే అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ఈ విషయంపై ఉత్కంఠ పెరిగింది. 50:50 ఫార్ములా అంశాల గురించి అమిత్‌షా.. ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి ఖరారు చేస్తారని బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ వెల్లడించారు. మహారాష్ట్రలో దుష్యంత్ లేడు: శివసేన విసుర్లు శివసేన తమకు అధికార దాహం లేదని, చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నామనే చెబుతోంది. రాజకీయాల్లో తాము ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తామని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. తమ ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకే తమ అధినేత ఉద్ధవ్ మొగ్గు చూపిస్తున్నారని అన్నారు. హరియాణాలో దుష్యంత్ తండ్రి జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రలో దుష్యంత్‌లెవరూ లేరని, అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోందని సంజయ్ రౌత్ బీజేపీపై చెణుకులు విసిరారు. బీజేపీ ముందున్న మార్గాలేంటి! బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 సీట్లు కావాలి. శివసేన రొటేషన్ పద్ధతిలో సీఎం డిమాండ్‌ను విడిచిపెట్టకపోతే బీజేపీ ఎన్సీపీతో చేతులు కలిపినా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్లేషకుల అంచనా. శివసేనకు మద్దతునివ్వబోమని ఇప్పటికే శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ తేల్చి చెప్పేసింది. ఈసారి ఎన్నికల్లో 54 సీట్లతో ఎన్సీపీ బలమైన శక్తిగానే అవతరించింది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే వారి బలం 159కి చేరుకుంటుంది. అందులోనూ పవార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో ఎన్సీపీ రాజీపడే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో 17 మంది బీజేపీ రెబెల్ అభ్యర్థులు గెలిచారు. వారందరినీ తమ వైపు తిప్పుకొని బలం పెంచుకోవడం ద్వారా శివసేనను బలహీనపరిచి తామే అయిదేళ్లు పాలించే వ్యూహాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ రెబెల్ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకుంటే 125కి బలం చేకూరుతుంది. మరోవైపు శివసేన కూడా స్వతంత్ర అభ్యర్థులపై వల వేస్తూ తన పవర్ చూపిస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాన్చుడు ధోరణి ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీపై పోరాటం చేసిన తమకు అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినప్పుడు దానిని జారవిడుచుకోకూడదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు సంకేతాలు పంపుతున్నాయి. 45 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. -
సేనకు మళ్లీ చేరువగా బీజేపీ!
బాల్ ఠాకరే వర్థంతి సందర్భంగా ఆసక్తికర పరిణామాలు సాక్షి, ముంబై: ఎన్నికలు పెట్టిన చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేనతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ ఆ పార్టీతో చెలిమికి సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. మరోవైపు వారసత్వ పోరు నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎడ మొహం, పెడ మొహంగా ఉన్న ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరేలు పక్కపక్కనే ఆశీనులై ఉల్లాసంగా ముచ్చటించుకుంటూ గడిపారు. సోమవారం ఇక్కడ జరిగిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే ద్వితీయ వర్థంతి కార్యక్రమం ఈ ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. శివాజీ పార్క్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఠాకరే మెమోరియల్ వద్ద ఎవరో ఒక రాష్ట్ర మంత్రి మాత్రమే నివాళులర్పిస్తారని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన వెంటే పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధానమంత్రి మోదీ కూడా ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తొలి వర్థంతికి హాజరైన అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలెవరూ సోమవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేదు. ఫడ్నవిస్ మాత్రం బాల్ ఠాకరేను పొగడ్తలతో ముంచెత్తారు. అందరికీ ఆయన తండ్రిలాంటివారన్నారు. మహారాష్ట్రలో ఆయన వంటి వ్యక్తి మరెవరూ లేరని అన్నారు. బాల్ ఠాకరే హోదాకు తగినస్థాయిలో సార్మక చిహ్నాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బాల్ ఠాకరే స్మృతి చిహ్నం ఏర్పాటుకు శివసేన దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. సేనతో చర్చలకు ద్వారాలు మూసుకుపోలేదని ఫడ్నవిస్ ఆదివారం నాగపూర్‌లో అన్నారు. సేనతో చర్చలు సాధ్యమేనని చెప్పారు. బీజేపీ, సేనల మధ్య సయోధ్యపై అయోమయం కొనసాగుతుండగానే ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాకరే చాలాకాలం తర్వాత సోమవారం సోదరుడు ఉద్ధవ్‌తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి హావభావాలు రెండు సేనల మధ్య సయోధ్యపై ఊహాగానాలకు తెరతీశాయి. ముఖంపై చిరునవ్వుతో వేదికనధిష్టించిన రాజ్.. ఉద్ధవ్, ఆయన చిన్న కుమారుడు తేజాస్, సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్‌లతో చేతులు కలిపారు. -
బాల్‌ఠాక్రేకు ఘన నివాళి
సాక్షి, ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ద్వితీయ వర్ధంతి సందర్భంగా శివాజీ పార్కులోని స్మారకాన్ని ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఠాక్రే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బాల్‌ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని సోమవారం శివాజీపార్క్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే స్మారకం వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన వేలాదిమంది పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు బాల్ ఠాక్రే స్మారకానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బాల్ ఠాక్రే అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్ధవ్‌ఠాక్రే కుటుంబ సభ్యులతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులయ్యారు. కాగా, మధ్యాహ్నం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వచ్చి నివాళులర్పించిన తర్వాత ఉద్ధవ్, రాజ్ పక్కపక్కనే కూర్చున్నారు. దాదాపు 15 నిమిషాలకుపైగా ముచ్చటించారు. సోదరులిద్దరూ విడిపోయిన చాలా కాలం తర్వాత ఇలా బహిరంగంగా చాలా సేపు మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రద్ధాంజలి ఘటించిన సీఎం.. అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బాల్‌ఠాక్రే స్మారకాన్ని సందర్శించారు. ఠాక్రే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. కాని అక్కడ గుమిగూడిన శివ సైనికులు ‘ముఖ్యమంత్రి చలే జావ్’ అంటూ నినాదాలు చేసి బీజేపీపై ఉన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన తర్వాత మీడియాతో సీఎం మాట్లాడుతూ ముంబైలో బాల్ ఠాక్రే స్మారకం నిర్మించేందుకు ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌తోపాటు ఇతర పార్టీల కీలక నాయకుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు బీజేపీ నాయకులు వెళతారా..? లేదా..? వెళితే ఎవరెవరూ వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవిస్ మంత్రి వర్గంలోని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, ఉద్యోగ మంత్రి ప్రకాశ్ మెహతా, విద్యాఠాకూర్ తోపాటు శివసేన ఎంపీ సంజయ్ రావుత్, నాయకులు అనిల్ దేసాయి, నీలం గోర్హే, మిలింద్ నార్వేకర్‌తోపాటు ఎమ్మెన్నెస్ నాయకులు బాలా నాంద్‌గావ్కర్, నితిన్ సర్దేశాయి. శిశిర్ షిండే తదితర ప్రముఖులు సందర్శించారు. కాగా, ఈ రోజును ‘ప్రేరణ దివస్’ గా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ షిండే అభివర్ణించారు. ఇదిలా ఉండగా, బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివాజీపార్క్ మైదానంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో శివసైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రక్తంలో కణాలు (ప్లేట్స్) తగ్గిన వారికి ఇలా దాతల ద్వారా సేకరించిన రక్తం ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. దగ్గరవుతున్న ఉద్ధవ్, రాజ్... ఠాక్రే కుటుంబం మళ్లీ దగ్గరవుతుండటం విపక్షాలకు మింగుడుపడని విషయమే.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో శివసేన, ఎమ్మెన్నెస్ విడివిడిగా పోటీచేసినా... అవసరమైతే ఉద్ధవ్‌తో కలిసి పనిచేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్‌ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం పరిణామాల్లో భాగంగా ఇటీవల రాజ్‌ఠాక్రే కుమార్తె ఊర్వశి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నప్పుడు ఉద్ధవ్‌ఠాక్రే కుటుంబ సమేతంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది బాల్‌ఠాక్రే వర్ధంతి రోజున రాజ్‌ఠాక్రే శ్రద్ధాంజలి ఘటించేందుకు శివాజీ పార్క్‌కు వెళ్లలేదు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఏడాది ఆయన తన పుణే పర్యటనను సైతం వాయిదా వేసుకుని ఠాక్రే స్మారకాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఉద్ధవ్‌తో కొంత సేపు గడపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలాఉండగా, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీల మధ్య రాజీ కుదరలేదు. పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో తమని వాడుకుని శాసన సభ ఎన్నికల్లో దూరం కొట్టిందనే భావన శివసేన నాయకుల్లో నాటుకుపోయింది. అదేవిధంగా లోక్‌సభ, ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పూర్తిగా చతికిలపడి పోయింది. దీంతో రాజకీయంగా ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకే విధంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడంతో భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సీఎం పీఠం మాకే కావలంటున్న శివసేన
-
మా పోరుకు మద్దతివ్వండి