Udon Air Service
-
విజయవంతంగా ‘ఉడాన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ స్కీమ్ విజయవంతమైందని పౌర విమానయాన శాఖ పేర్కొంది. మరిన్ని పట్టణాలను అనుసంధానించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్.ఎన్.చౌబే చెప్పారు. వింగ్స్ ఇండియా–2018లో భాగంగా గురువారమిక్కడ ఆయన వివిధ విమానయాన సంస్థల సీఈవోలతో సమావేశమైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘మరిన్ని ఎయిర్‌పోర్టుల ఆధునీకరణ చేపట్టాల్సిందిగా విమానయాన సంస్థలు కోరాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు చర్యలు చేపట్టాలని కంపెనీలు అభ్యర్థించాయి. దేశంలో 15 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తోంది’’ అని వివరించారు. విదేశాలకు ఉడాన్ దన్ను.. ఉడాన్‌ను ఆసరాగా చేసుకుని భారత్ నుంచి ఆసియాన్ దేశాలకు విమాన సర్వీసులు విస్తరించేందుకు అస్సాం ప్రభుత్వం ముందుకు వచ్చిందని, మూడేళ్లపాటు వైమానిక సంస్థలకు ఏటా రూ.100 కోట్ల నిధులు సమకూర్చేందుకు అస్పాం ప్రభుత్వం ప్రతిపాదించిందని చౌబే తెలిపారు. ‘వచ్చే అయిదారేళ్లలో భారత్‌కు 8–10 వేల మంది పైలట్లు అవసరమవుతారు. మూడేళ్లుగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది ఇది 17 శాతం ఉంటుంది. విమానాశ్రయల విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో రూ.18,000 కోట్లు వెచ్చించనున్నాం’ అని వెల్లడించారు. చేతి నిండా డబ్బులున్న సంస్థలు మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకుంటాయని ఎయిర్ కోస్టాను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. నిధులుంటేనే విమానయాన రంగంలో ప్రవేశించాలని హితవు పలికారు. వాటాల ఉపసంహరణ.. ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహకరణకై కొద్ది రోజుల్లో ఆసక్తి వ్యక్తీకరణకు కంపెనీలను ఆహ్వానిస్తామని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వెల్లడించారు. అలాగే పవన్ హన్స్లో సైతం వాటా విక్రయిస్తున్నామని చెప్పారు. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణకు మరోసారి ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. -
ఉడాన్‌లోకి 325 మార్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్లను ప్రభు త్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్ కింద రెండో రౌండ్ బిడ్డింగ్ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం వెల్లడించారు. మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు. కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్కూ ఉడాన్ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు. విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత మార్గాలు ఆరు నెలల్లోపే అందుబాటులోకి వస్తాయని అశోక్ గజపతి రాజు చెప్పారు. గతేడాది మార్చిలో ఉడాన్ పథకం తొలిరౌండ్ బిడ్డింగ్ జరగ్గా మొత్తం 128 మార్గాలను అప్పట్లో ఈ పథకం కింద వివిధ విమానయాన సంస్థలకు కేటాయించడం విదితమే. తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు మార్గం విమానయాన సంస్థ హైదరాబాద్–హుబ్లీ టర్బో ఏవియేషన్, అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–కొల్హాపూర్ ఇండిగో, అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–నాసిక్ అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–షోలాపూర్ అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–కొప్పళ్ టర్బో ఏవియేషన్ తిరుపతి–కొల్హాపూర్ ఇండిగో తిరుపతి–హుబ్లీ ఘొడావత్ (హెలికాప్టర్లు) వివిధ కొత్త మార్గాల్లో ముఖ్యమైనవి దర్భంగా–బెంగళూరు; దర్భంగా–ఢిల్లీ; దర్భంగా–ముంబై; కార్గిల్–శ్రీనగర్ హుబ్లీ – అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, కన్నూర్ కన్నూర్ – బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, ముంబై, తిరువనంతపురం బికనీర్ – జైపూర్ జైసల్మేర్ – అహ్మదాబాద్, సూరత్, ఉదయ్‌పూర్ పాక్యాంగ్(సిక్కిం) – ఢిల్లీ, గువాహటి, కోల్‌కతా వెల్లూరు – బెంగళూరు, చెన్నై హెలికాప్టర్ ద్వారా.. ముఖ్యమార్గాలు కులు–మనాలి సిమ్లా–మండి మండి–ధర్మశాల మండి–సిమ్లా హరిద్వార్–హల్ద్వని జోషిమఠ్–గౌచర్ మసోరి–డెహ్రాడూన్ -
రెక్కలు విచ్చుకున్న ‘ఉడాన్’
-
రెక్కలు విచ్చుకున్న ‘ఉడాన్’
సామాన్య ప్రజలకూ గగనతల ప్రయాణం: మోదీ - హవాయి చెప్పులు ధరించిన వారూ విమానం ఎక్కాలి - ఢిల్లీ–సిమ్లా మధ్య చవక విమాన ప్రయాణానికి శ్రీకారం - విమాన టికెట్ ధర గంటకు రూ.2,500 మాత్రమే సిమ్లా: సామాన్యులకు చవక ధరకే గగనతల ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్)– (ప్రాంతీయ అనుసంధాన పథకం–ఆర్సీఎస్) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా– ఢిల్లీ మధ్య మొట్టమొదటి విమాన సర్వీసును సిమ్లాలో జెండా ఊపి ప్రారంభించారు. అలాగే హైదరాబాద్–కడప, హైదరాబాద్– నాందేడ్ మధ్య విమాన సర్వీసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హవాయి చెప్పులు వేసుకున్న వారు కూడా విమానం (హవాయి జహాజ్)లో ప్రయాణిం చడం చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఈ పథకంలో తదుపరి ముంబై–నాందేడ్ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఢిల్లీ–సిమ్లా విమాన సర్వీసులో టికెట్ ధర రూ.2,036 మాత్రమే అని, ఇది ట్యాక్సీ రైడ్ కంటే తక్కువ ధర అని చెప్పారు. గతంలో మనం విమాన ప్రయాణం అంటే రాజులు, మహారాజులకే పరిమితమని భావించేవారమని, కానీ ఈ ఆలోచనా విధానాన్ని మార్చాలని తాము ఉడాన్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. సిమ్లా–ఢిల్లీ విమాన సర్వీసును ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ఆపరేట్ చేస్తోంది. ఇందుకోసం 42 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే సిమ్లా నుంచి బయలు దేరే సమయంలో ఉష్ణోగ్రత, ఆల్టిట్యూడ్‌తో పాటు రన్‌వే పరిమాణం తదితర కారణాలను పరిగణనలోకి తీసుకుని 12 మంది ప్రయా ణికులను మాత్రమే అనుమతించారు. ‘ప్రతి ఒక్కరూ ప్రయాణించాలి.. ఏకమవ్వాలి’అనేది తమ నినాదమని మోదీ పేర్కొన్నారు. 70 ఏళ్లయినా.. 70 ఎయిర్‌పోర్టులే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయ్యిందని, అయితే ఇప్పటికీ 70–75 ఎయిర్‌పోర్టులే అందుబాటులో ఉన్నాయని, ఉడాన్ ద్వారా 30కిపైగా కొత్త ఎయిర్‌పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ వల్ల టైర్–2, టైర్–3 నగరాలను అభివృద్ధి బాట పట్టించవచ్చని.. దేశానికి అవి ప్రగతి చక్రాలుగా పనిచేస్తాయని చెప్పారు. ఈ పథకం జాతీయ సమగ్రతకు దోహదం చేస్తుందని, విభిన్న సంస్కృతులు, సంప్రదా యాల కలయిక సాధ్యపడుతుందని అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటకు చార్జీ రూ.2,500 ప్రభుత్వం ఆర్నెల్ల క్రితం ప్రకటించిన ఉడాన్ పథకాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకురా వడం గమనార్హం. ప్రాంతీయ విమానయా నాన్ని అభివృద్ధి చేసేందుకు ఉడాన్ పథకంలో భాగంగా స్వల్ప దూర ప్రయాణానికి విమాన చార్జీని గంటకు రూ.2,500గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఐదు విమానయాన సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సంస్థలు తమ విమాన సర్వీసుల్లోని మొత్తం సీట్లలో 50 శాతాన్ని ప్రతిపాదిత సెక్టార్లలో గంటకు రూ.2,500 కంటే తక్కువకే అమ్మాలి. ఈ సంస్థలకు మొ త్తంగా 128 రూట్లను కేటాయించారు. ఇందు కు కేంద్రం ఆర్థిక సహకారాన్ని అంది స్తుంది. అలాగే నో ఎయిర్పోర్ట్ చార్జీలు.. ఆయా రూట్లలో మూడేళ్ల ప్రత్యేక గగనతల హక్కులు వంటి ప్రయోజనాలను కల్పిస్తుంది. కడప–హైదరాబాద్ మధ్య ఉడాన్ సర్వీసు సాక్షి, కడప సెవెన్‌రోడ్స్: కడప–హైదరాబాద్ మధ్య ఉడాన్ విమాన సర్వీసు ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడప ఎయిర్‌పోర్టులో వీక్షించారు. ప్రతిరోజు కడప–హైదరాబాద్ మధ్య ట్రూజెట్ సంస్థకు చెందిన విమానం నడుస్తోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సి.ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉడాన్‌తోపాటు కడప నుంచి విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగళూరుల మధ్య కూడా సర్వీసులు ప్రారంభిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, బద్వే లు ఎమ్మెల్యే జయరాములు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, కలెక్టర్ బాబూరావు నాయుడు పాల్గొన్నారు.