Uhalu gusagusalade
-
కోలీవుడ్‌లో బిజీ బిజీ!
ఊహలు గుసగుస లాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ రాశీఖన్నా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎన్టీఆర్, రవితేజ్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఈ భామ ఇప్పుడిప్పుడే ఇతర భాషల్లో బిజీగా అవుతున్నారు. విలన్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ, ప్రస్తుతం కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న సైతాన్ కా బచ్చా సినిమాలో నటిస్తున్న రాశీ.. నయనతార, అధర్వ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఇమైక్కా నోడిగల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న అడంగామరులోనూ హీరోయిన్గా అలరించనున్నారు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ అయోగ్య లోనూ హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకున్నారు రాశీ. కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించటం లేదు. -
నాలుగు భాషల్లో నాగశౌర్య చిత్రం
ఊహలు గుసగులాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ సినిమా తరువాత వరుసగా నాలుగు ఫ్లాప్‌లు పలకరించటంతో తన లేటెస్ట్ సినిమా కళ్యాణ వైభోగమే రిలీజ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పోటిపడి రిలీజ్ చేసి రిస్క్ చేసే కన్నా సోలో రిలీజ్ కోసం వెయిట్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య ఓ బహు భాష చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన రామ్ నిర్మాతగా, సాయి చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాకు నాగశౌర్యను హీరోగా ఎంపిక చేసుకున్నారు. భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగశౌర్య సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
'ఊహలు గుసగుసలాడే' టీంతో చిట్ చాట్