
ఊహలు గుసగుస లాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ రాశీఖన్నా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ అందుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎన్టీఆర్, రవితేజ్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఈ భామ ఇప్పుడిప్పుడే ఇతర భాషల్లో బిజీగా అవుతున్నారు.
విలన్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ, ప్రస్తుతం కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న సైతాన్ కా బచ్చా సినిమాలో నటిస్తున్న రాశీ.. నయనతార, అధర్వ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఇమైక్కా నోడిగల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న అడంగామరులోనూ హీరోయిన్‌గా అలరించనున్నారు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ అయోగ్య లోనూ హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నారు రాశీ. కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment