UK govt
-
యూకేలో ‘జిహాదీ జైళ్లు’
లండన్: ప్రమాదకర తీవ్రవాదుల కోసం యూకే ప్రభుత్వం ప్రత్యేకంగా జైళ్లను ఏర్పాటు చేయనుంది. దేశంలోని జైళ్లలో తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు మిగతా వారిని కూడా ప్రభావితం చేసి తీవ్రవాద మార్గంలోకి తీసుకువస్తున్నారు. దీంతో మంచిమార్గంలోకి తీసుకురావాలన్న తమ ఆశయం దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది. తీవ్రవాద చర్యలకు పాల్పడేవారి కోసం యోర్క్, వొర్సెస్టయిర్, డర్హమ్ ప్రాంతాల్లో త్వరలోనే వీటిని ఏర్పాటు చేయనుంది. వీటిల్లో ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను ఉంచుతారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ జీవన స్రవంతిలోకి తీసుకువస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ కారాగారాలను జిహాదీ జైళ్లు, జైళ్లలో జైళ్లు అని వ్యవహరిస్తున్నారు. -
లలిత్ మోదీకి షాక్
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని యూకే నుంచి భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. లలిత్ మోదీని భారత్ కు పంపాలని యూకే ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈడీ చేసిన అభ్యర్ధనకు కోర్టు అంగీకరించింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉన్నా ఆయన యూకేలో ఉండటంతో కేసు విచారణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే కోర్టు లో ప్రస్తావించిన ఈడీ తరఫు న్యాయవాది.. మోదీని వెనక్కు పంపాలని యూకే ప్రభుత్వానికి కోర్టు లేఖ రాయాలని కోరారు. విజయ్ మాల్యా విషయంలో కూడా ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేయగా అందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపేదుకు ఈడీ సిద్ధమవుతోంది. -
బ్రిటన్ వీసా పాలసీ ఇక టైట్..
లండన్: దేశంలో వలస దారులు సంఖ్య భారీగా పెరగడంతో బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టంలో భారీ మార్పులు ప్రకటించింది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మూడు రోజుల పర్యటనకు కొద్ది రోజులముందు అక్కడి ప్రభుత్వం ఈ మార్పులను గురువారం వెల్లడించింది. ఈయూ యేతర దేశాల ఉద్యోగ వీసా( టైర్ 2) జారీలో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా భారతదేశ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే టైర్-2 వీసా నిబంధనల్లో గణనీయమైనమార్పులు చేసింది. దీంతో ప్రభావంమన దేశ ఐటీ ప్రొఫెషనల్స్ పై భారీగా పడనుంది. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం, ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు తమ దేశంలో వెల్లువలా నమోదవుతున్న ఇమ్మిగ్రేషన్ గణాంకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 24 తర్వాత దరఖాస్తు చేసుకునే టైర్ 2 వీసాదారులు (ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్) అందుకోవాల్సిన వార్షిక జీతాన్ని 20, 800 పౌండ్లనుంచి 30 వేల పౌండ్లకు పెంచింది. టైర్ 2 జనరల్ లో మార్పులు చేస్తూ గ్రాడ్యుయేట్ ట్రైనీ జీతం 25వేల పౌండ్లుగా నిర్ణయించింది.అలాగే విద్యార్థి వీసాలకు (టైర్ 4కు) కూడా భారీ మార్పులు ప్రకటించింది. దీంతోపాటు బ్రిటన్లో ఐదేళ్ల పాటు ఉండే వారికి కొత్త ఇంగ్లీషు భాష నిబంధనలు కూడా మార్చింది. ముఖ్యంగా ఐసీటీ కేటగిరీలో 90 శాతం డిమాండ్ భారతీయ ఐటీ ఉద్యోగులదేనని బ్రిటన్ మైగ్రేషన్ ఎడ్వయిజరీ కమిటి లెక్కలు చెబుతున్నాయి. కాగా త్వరలోనే బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మన దేశంలో పర్యటించనుండగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఈ ఆదివారం ఢిల్లీ చేరనున్నారు. వలసదారులపై కొరడా ఝళిపించడానికి బ్రిటన్ సమాయత్తమవుతోందనీ, ఈ చర్యలతో భారత వలసదారులపై తీవ్ర ప్రభావం పడనుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. -
భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్!
కోల్కత్తా: భారత విద్యార్థులను ఆకర్షించడానికి యుకే(యునైటేడ్ కింగ్డమ్) ప్రభుత్వం ఉపకార వేతనాలను పెంచింది. గత కొన్నేళ్లుగా బ్రిటన్లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యుకే ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉండే బోగస్ కాలేజీలన్నింటినీ తొలగించామని, ఇప్పుడు గుర్తింపు పొందిన కాలేజీలు మాత్రమే ఉన్నాయని మినిష్టర్ కౌన్సిలర్(పోలిటికల్,ప్రెస్) ఆఫ్ బ్రిటిష్ హై కమిషన్ ఆండ్రూ సోపర్ గురువారం విలేకరులకు తెలిపారు. గ్రేట్ బ్రిటన్ పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులకు 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అందిస్తున్నామని తెలిపారు. యుకేలో చదువాలనుకునే భారత విద్యార్థుల కోసం విసాను కూడా సులభతరం చేశామని చెప్పారు. పదిమంది విద్యార్థుల్లో తొమ్మిది మందికి విసా వచ్చేలా చేస్తున్నామని యుకే ప్రభుత్వం తెలియజేసింది. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజనీరింగ్ కోర్సులుకూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది భారత విద్యార్థులు 20వేల మంది వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, వారికి రూ. 49 కోట్లు స్కాలర్షిప్లు అందుతున్నాయని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియన్ డెరైక్టర్ రోబ్ లైన్స్ తెలిపారు. అయితే, 2013లో భారత విద్యార్థులు 24,000 మంది బ్రిటన్లో చదువుకున్నారని చెప్పారు. బ్రిటన్కు చెందిన వెయ్యిమంది విద్యార్థులు భారత్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.