గొంతెత్తితే ఖబడ్దార్
ఈ చిత్రం చూస్తే సరిహద్దులో అప్రమత్తమైన సైనిక వాతావరణం తలపిస్తోంది కదూ..కానీ కాదు.. పూడిమడక వద్ద ఆల్ట్రా సూపర్ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమానికి పోలీసుల బందోబస్తు ఇది .
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన గళం ఎత్తనీయకుండా ప్రభుత్వం తీసుకున్న అతి అప్రమత్తత ఇది. భారీగా పోలీసు బలాన్ని ప్రయోగించింది. 600 మంది పోలీసులతో మార్చిఫాస్ట్ నిర్వహించి మత్స్యకారులను భయాందోళనలకు గురిచేశారు.