uma reddy
-
సాగుకు భరోసా..!
‘వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.. విత్తనాల తయారీ, ఉత్పత్తిలో ముందడుగు వేశాం.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విత్తనాలపై ఆధారపడి ఇప్పుడు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం.. వివిధ రాష్ట్రాల నుంచి మన విత్తనాలు కావాలని ఇండెంట్ పెడుతున్నారు’ అని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..స్వరాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమే ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ.నరసింహారావు వెటర్నటీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్, జగిత్యాల, పాలెం (మహబూబ్‌నగర్ జిల్లా)లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు అనుబంధంగా వ్యవసాయ కళాశాలలను నెలకొల్పింది. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ విద్యనభ్యసించేవారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలలో విద్యార్థులకు పరిశోధనతోపాటు బోధన జరుగుతోంది. వరంగల్‌కు వెటర్నరీ కళాశాల కూడా వచ్చింది.పెరిగిన సాగువిస్తీర్ణం..సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి అయ్యింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి ల«భ్యత, సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం, పత్తి దిగుబడి ఎక్కువగా వస్తోంది. ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ అధిగ దిగుబడి సాధిస్తున్నాం. కూలీల కొరతను అధిగవిుంచేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.మెరుగైన రైతుల ఆర్థికపరిస్థితి..సాంకేతికతతో పంట దిగుబడులు పెరగడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అధిక సాంద్రత పత్తితో రైతులు లాభసాటి సాగు చేస్తున్నారు. పత్తి తీసివేసిన తర్వాత మరో పంట సాగు చేస్తున్నారు. గతంలో పత్తి తర్వాత ఈ భూమిలో పంట వేయకుండా వదిలేసే వారు. రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచి్చంది. సకాలంలో పెట్టుబడి అందుతుండడంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ‡రైతుబీమా రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా చేయించిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సొమ్ము వస్తుంది.అనుబంధ రంగాలకు ప్రోత్సాహం..వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన పథకాలు అమలవుతున్నాయి. పశువైద్య, పశుసంవర్థక శాఖ ద్వారా గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు. దీంతో పెంపకందారులకు ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోంది. ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్..ఏఓలు, ఏఈఓల నియామకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక ఏఈఓను నియమించింది. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు, రైతుల సందేహాలు తీర్చుకునేందుకు ప్రతి క్లస్టర్లో రైతు వేదిక నిర్మించింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు రైతులకు అందిస్తున్నారు.వాట్సాప్ ద్వారా రైతుల సందేహాల నివృత్తి..వారంలో రెండు రోజులు వాతావరణ పరిస్థితులు వివరిస్తుండడంతో రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటునానరు.అదేవిధంగా పీజేటీఎస్ ఏయూ యూట్యూబ్ చానల్ ప్రారంభించి సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు. వాట్సా ప్ ద్వారా కూడా రైతుల సందేహాలు తీరుస్తున్నాం.మేలైన వంగడాల వృద్ధి..రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుములు, పెసర, కుసుమ, నువ్వు తదితర మేలు రకమైన వంగడాలు వృద్ధి చేశాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1010 వరి రకానికి ప్రత్యామ్నాయంగా కునారం సన్నాలు, జేజీఎల్–2423 వంగడాలను తీసుకొచ్చాం. బీపీటీ–5204కు ప్రత్యామ్నాయంగా షుగర్ లెస్ వరి విత్తనం ఆర్ఎన్ఆర్–1504 (తెలంగాణ సోనా)ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. కందిలో ఎల్‌ఆర్‌జీ–41కి ప్రత్యామ్నాయంగా డబ్ల్యూజీఎల్–97 వంటి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు మన విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 24న విత్తన మేళా నిర్వహించి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం.విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం.. విలువ ఆధారిత ఉత్పత్తులు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు అధిక ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మిర్చి, పసుపును పొడిగా మార్చి విక్రయిస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. భవిష్యత్‌లో ఈ విధానం పెద్ద ఎత్తున ఆచరించే అవకాశముంది. తాండూరు కంది పప్పు జీఐ ట్యాగ్ సాధించింది.రైతుల వద్దకే వ్యవసాయ అధికారులు..జిల్లాల పునర్విభజన తర్వాత రైతుల ముంగిటికి జిల్లా వ్యవసాయf అధికారులు వస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. తద్వారా రైతులకు వ్యవసాయ అధికా రుల సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏజీ హబ్ ద్వారా గ్రామీణ ప్రాంత యువ రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.– డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, సహ పరిశోధన సంచాలకుడు -
ఆ ముగ్గురు ముంచారు
ప్రధాని నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను నిలువునా దగా చేశారని.. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రస్తావన రాకపోవడం దారుణమని అన్నారు. రూ400 కోట్లు ఖర్చు చేసిన ఆర్భాటాలు రాష్ట్రానికి ఏవిధంగానూ ఉపయోగ పడలేదని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి అసెంబ్లీ, పార్లమెంట్ లను అగౌరవ పరిచారని చెప్పారు. -
'పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి'
-
అది విభజన కూటమి..
‘ఛీ.. పొమ్మ’న్నా కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకుంటున్నారు బాబు పాలనలో 100 తప్పులు అంటూ బీజేపీ చార్జ్‌షీట్ గుర్తులేదా? వై ఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించాలనుకోవడం కలే.. అది నిజం కాదు ఇది చారిత్రక పొత్తు కాదు.. చరిత్రహీనమైన పొత్తు.. చారిత్రక తప్పిదం జగన్‌ను ఎదుర్కోలేకే బీజేపీతో చంద్రబాబు పొత్తు: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీడీపీ-బీజేపీలది విభజన కూటమి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. ‘‘రాష్ట్ర విభజనకు టీడీపీ ఒప్పుకుంది. బీజేపీ కూడా అనుకూలంగా ఓటేసింది. ఇరు పక్షాలూ రాష్ట్ర విభజనలో భాగస్వామ్యులయ్యారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. రెండు పార్టీలూ కేంద్రంలోని కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్టు రూఢీ అయిందని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ ఒకే దగ్గరకు వచ్చాయని విమర్శించారు. రాష్ట్ర విభజనకు దోహదపడిన చంద్రబాబుకు.. ఇటీవల జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్‌కల్యాణ్ మద్దతిచ్చారంటే ఆయన కూడా విభజన వాదేనని వ్యాఖ్యానించారు. ఒకవైపు బీజేపీతో పొత్తు, మరోవైపు కాంగ్రెస్‌తో కాపురం చేస్తూ ఎన్ని జిత్తులు చేసినా టీడీపీకి ఓటమి ఖాయమన్నారు. ఉమ్మారెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిన కారణంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమని తెలిసే.. బీజేపీ ‘ఛీ.. పొ’మ్మన్నా కాళ్లా వేళ్లా పడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంతో పాలు పంచుకునేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు. బాబుపై బీజేపీ చార్జ్‌షీట్‌ను మర్చిపోయారా? టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు, సంభాషణలను గుర్తుచేసుకుంటే.. ఆ రెండింటి మధ్య పొత్తు చారిత్రక పొత్తా? చరిత్ర హీనమైన పొత్తా? అనేది అవగతమవుతుందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ 1997లో కాకినాడ తీర్మానాన్ని గుర్తుచేస్తూ.. ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు అనే నినాదం.. ఎలా వచ్చిందో టీడీపీ, బీజేపీలు ఆలోచించుకోవాలన్నారు. 1998లో బాబు పరిపాలనలో వంద తప్పులు అంటూ బీజేపీ చార్జిషీట్ వేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ‘‘ఢిల్లీలో వియ్యం - హైదరాబాద్‌లో కయ్యం.. అక్కడ కో-ఆపరేషన్ - ఇక్కడ ఆపరేషన్.. ఢిల్లీలో ప్రేమ - గల్లీలో డ్రామా.. ఇదేం హైటెక్ పోకడ అని అప్పట్లో అన్న మాటల్ని ఇప్పుడు ఇరుపక్షాల నేతలూ అంగీకరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. నాడు మోడీని నరహంతకుడన్నారు కదా? గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు హైదరాబాద్ వస్తే స్వాగతిస్తానని చెప్పడం ఎంతవరకు సబబు అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటరాని పార్టీగా తేల్చి, మోడి నరహంతకుడు అని, ఆయనకు ఎలాంటి అర్హతలేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధమవటం ఏ విధమైన నైతికం’’ అని నిలదీశారు. ఇది చారిత్రక తప్పిదమన్నారు. తనకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్‌లు పోటీయే కాదని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీలో ఉన్న అదనపు అర్హతలేమిటో చెప్పాలన్నారు. మైనారిటీలు, సమైక్యవాదులకు దూరమయ్యేందుకు తప్పితే ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పొత్తు ఉపయోగపడదన్నారు. బాబు నమ్మకద్రోహాన్ని జనం గ్రహించారు ఎన్ని ఎత్తులు వేసినా టీడీపీ వైఫల్యాలను, చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను వ్యతిరేకించి గెలవడ ం బాబుకు సాధ్యం కాదు కనుకే పొత్తుల వెంట వెళ్తున్నారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జనం నాడి ఎలా ఉందో అందరికీ తెలుసునని, ైవె ఎస్సార్ సీపీని ఓడించాలనుకోవడం కలేనని, అది వాస్తవ రూపం దాల్చదని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు. టీడీపీతో దోస్తీ చరిత్ర మర్చిపోయారా? చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాము పాడైపోయామని 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు చెప్పిన విషయాన్ని ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. 2004 ఎన్నికల్లో బీజేపీ నేతలు కూడా అదే తేల్చారంటూ.. చరిత్ర మర్చిపోయారా అని ప్రశ్నించారు. బాబుకు ఒక విధానమంటూ ఏమీ లేదన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానం లేకుండా పోయిందం టూ 2009లో హిందూ పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేక వివిధ జిల్లాల బీజేపీ నేతలు రెండు రోజుల క్రితం మూకుమ్మడిగా తీర్మానాలు చేయడం గుర్తుచేసుకోవాలని ఉమ్మారెడ్డి అన్నారు. 2004లో తాము నష్టపోయిన విషయాన్ని పేర్కొంటూ బీజేపీ నేత జవదేకర్‌కు కూడా విన్నవించారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈ ఎన్నికల్లో పోటీకి దూరమని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడాన్ని బట్టి పరిస్థితిపై ఆలోచించుకోవాలని సూచించారు. అపవిత్ర, అనైతిక కలయికను ప్రజలు కూడా హర్షించరన్నారు. -
అన్ని నదులపైనా తీవ్ర ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపకంలో 75 శాతం డిపెండబిలిటీని 65 శాతానికి తగ్గించిన ప్రభావం రాబోయే రోజుల్లో ఒక్క కృష్ణా నది విషయంలోనే కాదు అన్ని నదుల జలాల పంపిణీపైనా తీవ్రంగా ఉంటుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు స్పష్టం చేసింది. శుక్రవారం అఖిలపక్షంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే 75 శాతం డిపెండబిలిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్ప 65 శాతం ఎక్కడా లేదని తెలిపారు. 75 శాతం డిపెండబిలిటీకే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. భేటీ తర్వాత నాగిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కులను ఖాతరు చేయలేదు. ఆయన మిగులు జలాలను పంచారు.. కానీ తరుగు సంవత్సరాల్లో నీటిని ఎలా పంచుకోవాలి? పై రాష్ట్రాల్లో వర్షాలు సరిగా పడకుంటే, నదిలో నీళ్లు సరిగా లేకపోతే మిగతా రాష్ట్రాలు ఏ విధంగా నీటిని పంచుకుంటాయనేది వివరించలేదు. ఇది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నీటి విడుదల ఆలస్యమైతే రెండు పంటలు పండించే ఆంధ్రప్రదేశ్‌లో ఒక పంటకే పరిమితం కావాల్సి వస్తుందని చెప్పామన్నారు. ‘‘బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాల వినియోగం వెసులుబాటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రాజెక్టులు కట్టుకుంటే... ఒక్క తెలుగు గంగకు మాత్రమే 25 టీఎంసీలు నీళ్లు ఇచ్చి, మిగులు జలాలపై ఆధారపడిన మరో ఆరు ప్రాజెక్టులకు ఏ కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే రాష్ట్రం ఆయా ప్రాజెక్టులపై రూ.30 వేల కోట్లు వెచ్చించింది. ఆ ఆరు ప్రాజెక్టులను ట్రిబ్యునల్ ఎక్కడా పట్టించుకోలేదు..’’ అని అన్నారు. ఏపీ ప్రభుత్వ ఎస్ఎల్పీలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలని కోరినట్లు ఉమ్మారెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తుదితీర్పు వచ్చేవరకు, సరైన న్యాయం జరిగేంతవరకు ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయవద్దని కోరామన్నారు. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు వచ్చినప్పటి నుంచే ఈ పోరాటం చేసివుంటే చాలా బాగుండేదని, తుది తీర్పు వచ్చేవరకు అధికారపక్షం పట్టించుకోక పోవడం బాధాకరమని నాగిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. 2010లో మధ్యంతర తీర్పు వచ్చినప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘జలదీక్ష’ చేసిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్ ఇచ్చిన లేఖవల్లే మిగులు జలాల్లో అన్యాయం జరిగిందని పలు పార్టీలు చేస్తున్న విమర్శలన్నీ పూర్తిగా తప్పని, ఇదంతా మోసపూరితంగా చేస్తున్న ప్రచారమని స్పష్టం చేశారు. వైఎస్ వచ్చాకే ఆరు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాతే ఇవన్నీ చేపట్టడం జరిగిందనేది వాస్తవమని చెప్పారు. అన్ని అంశాలు పరిశీలిస్తామన్నారు ‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ గతంలో బచావత్ అవార్డు ఇచ్చిన రక్షణలను ఉల్లంఘించింది. పై రాష్ట్రాలకు అనేక కేటాయింపులు ఇచ్చారు. ఇది సరైంది కాదు. ఈ తీర్పు వల్ల దేశంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త చిక్కులొస్తాయి. అందువల్ల తీర్పు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా చూడాలని, ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పీలో కేంద్రం ఇంప్లీడ్ కావాలని ప్రధానిని కోరాం. ఆయన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు..’ - మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి ఆలమట్టి ఎత్తు పెంచే అధికారం లేదని చెప్పాం ‘ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి డెత్ వారెంట్ రాసినట్లుగా ఉందని చెప్పాం. ట్రిబ్యునల్‌కు కేవలం నీటిని పంచే హక్కు మాత్రమే ఉందని, ఆలమట్టి ఎత్తును పెంచే హక్కు ఏ మాత్రం లేదని వివరించాం..’ - రావుల, కోడెల (టీడీపీ) బ్రిజేశ్‌ను కొనసాగించొద్దన్నాం ‘కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన బ్రిజేశ్కుమార్కే రాష్ట్రాల విభజన అనంతరం నదీ జలాల పంపిణీపై పర్యవేక్షణ బాధ్యతలు కట్టబెడుతూ జీవోఎం సిఫారసులు చేసింది. ఆయన్ను పర్యవేక్షకునిగా కొనసాగించరాదని ప్రధానిని కోరాం..’ - నారాయణ, గుండా మల్లేశ్ (సీపీఐ) ప్రధాని నిస్సహాయత వ్యక్తం చేశారు ‘ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చాక ఏం చేయలేం కదా? అన్న తరహాలో ప్రధాని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి అవసరాలకు అనుగుణంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రధానిని విడిగా కోరాం..’- వినోద్ (టీఆర్ఎస్) మహబూబ్‌నగర్, నల్లగొండలకు న్యాయం చేయమన్నాం ‘ట్రిబ్యునల్ తీర్పులో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. పార్లమెంట్లో దీనిపై చర్చకు వచ్చిన సమయంలో అయినా ఈ రెండు జిల్లాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరాం..’ - నాగం జనార్ధన్‌రెడ్డి (బీజేపీ) పర్యవసానాలు అధ్యయనం చేస్తామన్నారు ‘మిగులు జలాలపై ఆధారపడి తెలంగాణ, సీమల్లో ఆరు ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రస్తుత తీర్పుతో ఆ ప్రాజెక్టులకు నీరందక రాష్ట్రం ఎడారిగా మారుతుందని చెప్పాం’. - రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీపీఎం