కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది
సియోల్: తమ దేశ సరిహద్దుల్లో దక్షిణ కొరియా, అమెరికా సంకీర్ణ సేనలు కవ్వింపు చర్యలకు ప్పాలడుతున్నాయని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతమైన ట్రూస్ గ్రామంలో దక్షిణ కొరియా, అమెరికా సంకీర్ణ సేనలు లైటింగ్ పరికరాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని నార్త్ కొరియన్స్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
శుక్రవారం సాయంత్రం నుంచి పన్ముంజమ్లోని తమ రక్షణ స్థావరాలపై (గార్డ్పోస్ట్)లపై ఫ్లడలైట్లు ఫోకస్ చేస్తూ తమ దళాల సాధారణ కార్యకలాపాలకు ఆ రెండు దేశాలు భంగం కలిగిస్తున్నాయని ఉత్తర కొరియా ప్రకటనలో పేర్కొంది. గత సోమవారం నుండి దక్షిణ కొరియా, అమెరికాలు కొరియన్ పెనిన్సులా తీరం వద్ద వార్షిక సంయుక్త దళాల విన్యాసాల్ని మొదలైనప్పటినుంచి ఈ కవ్వింపు చర్యలు అధికమయ్యాయని ఉత్తర కొరియా ప్రకటనలో పేర్కొంది. ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడటం తమ సహనాన్ని పరీక్షించడమేనని దీనిపై ధీటుగా జవాబిస్తామని తెలిపింది.
ఉత్తర కొరియా ప్రకటనపై దక్షిణ కొరియా నుంచి ఏమీ స్పందన లేకపోగా... ఉత్తర కొరియా ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మాత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఉత్తర కొరియా జూలై, ఆగస్టు నెలల్లో నాలుగు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇక ట్రూస్ గ్రామంలో ఉత్తర కొరియా ల్యాండ్మైన్లను అమర్చుతుందని మంగళవారం అమెరికా బలగాల కమాండర్ ఆరోపణలు గుప్పించా