UN nations
-
బాబోయ్ భారత్.. లైంగిక హింసలో టాప్!
భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చిన విషయమిది. దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చేదు వాస్తవమిది. మహిళల రక్షణపై తాజా సర్వే మన పరువు తీసేసింది. మహిళలకు భారతదేశమే అత్యంత ప్రమాదకరమైనదని థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యాచారాలు, లైంగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సెక్స్ బానిసలుగా మార్చడం, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అమానవీయమైన సంప్రదాయ పద్ధతులు వంటి అంశాల్లో మహిళలకు భారత్ చాలా ప్రమాదకరంగా మారిందని సర్వే తేల్చింది. నిరంతరం యుద్ధంతో అతలాకుతలమయ్యే అఫ్గానిస్తాన్, సిరియాల్లో కంటే మన దేశంలో మహిళలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ రెండు, సిరియా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా దేశాలు ఉంటే అగ్రరాజ్యం అమెరికా పదో స్థానంలో ఉంది. ఇదే సంస్థ 2011 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేలో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ఆరోగ్యం, ఆర్థిక వనరులు, లింగ వివక్ష, లైంగిక హింస–వేధింపులు, ఇతరత్రా హింసలు, అక్రమ రవాణా, సాంస్కృతికంగా, మతపరంగా వస్తున్న సంప్రదాయ పద్ధతులు వంటి అంశాలను థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వేలో ప్రామాణికంగా తీసుకుంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లోని మహిళా సమస్యలపై అధ్యయనం చేస్తున్న 548 నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. మార్చి 26–మే4 మధ్య ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలుసుకొని సర్వే నిర్వహించింది. వీరంతా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతేనని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంప్ రేప్, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన రేపిన కల్లోలం నేపథ్యంలోనే ఈ సర్వే రావడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ అంశాల్లో భారత్ ర్యాంకింగ్ లైంగిక హింసలో మొదటి స్థానం అక్రమ రవాణాలో మొదటి స్థానం సంప్రదాయంగా వస్తున్న అనాచారాల్లో మొదటి స్థానం లింగవివక్షలో మూడో స్థానం గృహ హింస ఇతర శారీరక హింసల్లో మూడో స్థానం మహిళల ఆరోగ్య పరిస్థితుల్లో నాలుగో స్థానం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు 1. భారత్ 2. అప్గానిస్థాన్ 3. సిరియా 4. సోమాలియా 5. సౌదీ అరేబియా 6. పాకిస్తాన్ 7. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 8. యెమన్ 9. నైజీరియా 10. అమెరికా దేశానికే అవమానం : రాహుల్ గాంధీ మన ప్రధాని నరేంద్ర మోదీ తన తోటలో తిరుగుతూ యోగా వీడియోలు రూపొందించడంలో నిమగ్నమై ఉంటే, మహిళలపై అత్యాచారాలు, హింసలాంటి అంశాల్లో అఫ్గానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు మనం నేతృత్వం వహిస్తున్నాం. నిజంగా మన దేశానికి ఇదెంత అవమానం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గంటకి నాలుగు అత్యాచారాలు మన దేశంలో ఎటు చూసినా మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. 2012లో న్యూఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా యువతీ యువకులు రోడ్డెక్కడంతో నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకారం ప్రతీ గంటకి నలుగురు మహిళలపై అత్యాచారం ప్రతీ గంటలో మహిళలపై 26 నేరాలు ప్రతీ రోజూ వందకి పైగా లైంగిక దాడి కేసులు నమోదు గంటకి అయిదుగురు మహిళల ప్రసూతి మరణాలు ప్రతీ రోజూ 21 వరకట్న మరణాలు ఏడాదికి 34,651 అత్యాచార కేసులు నమోదు మహిళలపై ఏడాదికి నమోదవుతున్న నేరాల సంఖ్య 3,27,394 దేశంలో మహిళలపై జరిగే మొత్తం నేరాల్లో ఢిల్లీ వాటా 52% 2007–16 మధ్య కాలంలో మహిళలపై నేరాల్లో పెరుగుదల 83% ఇందులో మరణాలే ఎక్కువగా ఉన్నాయి. -
ప్రధానికి యార్లగడ్డ అభినందనలు
న్యూఢిల్లీ: అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ అన్ని ప్రధాన కార్యక్రమాల్లో హిందీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీని కేంద్ర హిందీ సలహా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందించారు. ఐక్యరాజ్య సమితిలో తొలి సారి హిందీలో ప్రసంగించిన ఘనత మాజీ ప్రధాని వాజ్ పేయ్దేనని గుర్తుచేస్తూ సమితిలో హిందీని అధికార భాష చేయాలని ఆయన కలలుగన్నారని చెప్పారు. వాజ్‌పేయ్ కలలను మోదీ సాకారం చేయాలని యార్లగడ్డ కోరారు. -
కశ్మీర్‌పై బహుపరాక్!
కశ్మీర్ ఉద్రిక్తతలు ఎడతెగకుండా సాగుతున్నకొద్దీ బయటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెర్స్ చేసిన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇరు దేశాలూ చర్చలద్వారా కశ్మీర్ సమస్య పరిష్కరించుకునేలా ఒప్పించడం కోసమే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మూడుసార్లు, ప్రధాని నరేంద్రమోదీతో రెండుసార్లు మాట్లాడానని ఆయన చెప్పు కున్నారు. ఆయన దీన్ని మధ్యవర్తిత్వం నెరపడంగా చెప్పడం లేదు. సమస్యను వారే మాట్లాడుకుంటారని అంటున్నారు. అయితే అమెరికా ఇంతకు మించి మాట్లా డింది. ఆమధ్య ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ‘ఒప్పందాలు కుదర్చడంలో ఉన్న అసాధారణ నైపుణ్యం’ కశ్మీర్ సమస్య పరి ష్కారానికి దోహదపడుతుందని ప్రకటించారు. సరిగ్గా పాకిస్తాన్ కోరుకుంటున్నది ఇదే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారకుండా చూస్తే...కశ్మీర్ కల్లోలం ఎప్పటికీ ఆగకపోతే ప్రపంచ దేశాలు తన దారికి వస్తాయని, భారత్‌పై ఒత్తిడి తెస్తాయని ఆ దేశం అనుకుంటోంది. కనుకనే ఈ రెండు అంశాల్లోనూ మన దేశం అత్యంత జాగరూకతతో అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది. మునుపటితో పోలిస్తే అంతర్జాతీయ పరిస్థితుల్లో గణనీయంగా మార్పు లొచ్చాయి. మూడేళ్లనాడు బీజేపీని విజయపథంలో నడిపించిన ‘అబ్కీ బార్, మోదీ సర్కార్’ నినాదాన్ని పుణికిపుచ్చుకుని ట్రంప్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో భార తీయ అమెరికన్లను ఆకర్షించారు. చాలా విషయాల్లో మోదీ, ట్రంప్ అభిప్రాయాలు కలుస్తున్నాయి గనుక ఆయన వైఖరి మనకే అనుకూలంగా ఉంటుందని కొందరు అంచనా వేశారు. కానీ ట్రంప్ ఫక్తు వ్యాపారవేత్త. ఆయనకు భారత్–పాక్‌ల మధ్య ఉన్న కశ్మీర్ వివాదం రియల్ఎస్టేట్ గొడవగా కనిపిస్తున్నట్టుంది. బిల్డర్‌గా స్థలా లను సేకరించడం కోసం రకారకాల వ్యక్తులతో మాట్లాడటం, ఒప్పించడం ట్రంప్ కున్న చిరకాల అనుభవం. దాన్నే మైక్ పెన్స్ ‘అసాధారణ నైపుణ్యం’గా లెక్కేశారు. ఆయనే కాదు... ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉంటున్న నికీ హెలీ రెండు నెలలక్రితం ఆ మాదిరే మాట్లాడారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గడం కోసం రెండు పక్షాలతో చర్చించి మధ్యవర్తి పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు లేకుండా చూడటమే తమ ధ్యేయమన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల మన దేశ పర్యటనకొచ్చినప్పుడు కూడా మధ్య వర్తిత్వం ప్రతిపాదన చేశారు. ఇలా పాక్ ఎప్పటినుంచో చేస్తున్న వాదనలకు అను కూలంగా లేదా దాని అభిప్రాయాలకు చేరువగా ఉండే మాటలు వినబడటం క్రమేపీ పెరుగుతున్నదని వీటన్నిటినీ గమనిస్తే అర్ధమవుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరిగినప్పుడల్లా కశ్మీర్ సమస్యను లేవనెత్తడం, ఆ వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించమని కోరడం పాకిస్తాన్‌కు రివాజు. అన్ని సందర్భాల్లోనూ మన దేశం ఆ వాదనను ఖండిస్తూ వస్తోంది. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్యా వివాదం ఉన్న సంగతిని మనం కాదనడం లేదు. చారిత్రక వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్క రించుకుందామని మన దేశం ప్రతిపాదిస్తూనే ఉంది. అయితే అందుకోసం సరిహద్దుల్లో శాంతి నెల కొనాలని, రాష్ట్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని అంటోంది. ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ పాక్ ఏదో రకంగా దానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఈ సమస్యలో అంతర్జాతీయ జోక్యం అవ సరమంటూ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగ పరిధిలో కశ్మీరీల ఆకాంక్షలను సాకారం చేస్తామని గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, వాజపేయి, మన్మోహన్సింగ్ పలుమార్లు చెప్పారు. వాజపేయి అయితే జమ్ము– కశ్మీర్ సహా ఎనిమిది అంశాలపై సమగ్ర చర్చలు జరపడానికి లాహోర్‌కు బస్సు దౌత్యం నెరపారు. అదృష్టవశాత్తూ మన దేశంలో పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా కశ్మీర్ సమస్యపై వాటన్నిటిదీ ఒకటే మాట. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమికి చెందిన ప్రభుత్వాలున్నా ఆ సమస్యపై మూడో పక్షం జోక్యాన్ని నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తూనే వస్తున్నాయి. జమ్మూ–కశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిదీ ఇదే వైఖరి. రాజకీయంగా ఈ స్థాయిలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతర్గ తంగా ప్రశాంత పరిస్థితులు ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు? రాష్ట్రంలోని నొవాత్తా జిల్లాలోని మసీదు వెలుపల శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న డీఎస్పీ ఒకరిపై బుధవారం గుంపు దాడిచేసి అత్యంత పాశవికంగా కొట్టి చంపిన ఉదంతం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది. గత కొన్ని నెలలుగా అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. భద్రతాబలగాలపై దాడులు, ఉద్యమాలు ఆగడం లేదు. ఇదిలా రావణకాష్టంలా మండుతున్నకొద్దీ ప్రపంచంలో అందరి దృష్టీ దానిపై కేంద్రీకృతమవుతుంటుంది. పాకిస్తాన్‌కు, కశ్మీర్లో ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న శక్తులకు మరింత ఊతమిస్తుంది. జమ్మూ–కశ్మీర్లో పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయని అందరూ ఆశపడ్డారు. అది లేకపోగా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పీడీపీ నాయకురాలు, ముఖ్యమంత్రి మెహబూబా అటు కేంద్రాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేయలేకపోతున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చక్కదిద్ద లేకపోతున్నారు. చెప్పాలంటే ఆమెకు ఇరువైపులా విశ్వసనీయత లేకుండా పోయిందన్న అభిప్రాయం కలుగుతుంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గమనించి అయినా కశ్మీర్లో ప్రశాంతత నెలకొనేలా చూడటం, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆ దిశగా అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. లేనట్టయితే కశ్మీర్‌పై గట్టెర్స్ మొదలుకొని ఎర్డోగాన్ వరకూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూనే ఉంటారు.