న్యూఢిల్లీ: అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ అన్ని ప్రధాన కార్యక్రమాల్లో హిందీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీని కేంద్ర హిందీ సలహా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందించారు. ఐక్యరాజ్య సమితిలో తొలి సారి హిందీలో ప్రసంగించిన ఘనత మాజీ ప్రధాని వాజ్ పేయ్‌దేనని గుర్తుచేస్తూ సమితిలో హిందీని అధికార భాష చేయాలని ఆయన కలలుగన్నారని చెప్పారు. వాజ్‌పేయ్ కలలను మోదీ సాకారం చేయాలని యార్లగడ్డ కోరారు.