Yarlagadda laxmi prasad
-
‘ఎమ్మెస్కో’కు లోక్‌నాయక్ పురస్కారం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 18న విశాఖలోని వుడా బాలల థియేటర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమెస్కో ప్రధాన కార్యనిర్వాహకుడు డి.విజయ కుమార్‌కు ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామని వివరించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా అందజేసే పురస్కార మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. జీఓ–81తో ప్రయోజనమే.. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ–81తో పలు ప్రయోజనాలు ఉన్నాయని యార్లగడ్డ చెప్పారు. ఈ జీవో వల్ల సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఓక్రిడ్జ్ పాఠశాలల్లో సైతం తెలుగుభాషకు స్థానం లభిస్తుందన్నారు. పాదయాత్రలో కలిసిన ప్రజల అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ బాబయ్య పాల్గొన్నారు. -
టీడీపీ చట్టాన్ని ఉల్లంఘించింది: యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తెలుగును అవమానించిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి తెలుగంటే గౌరవం లేదని విమర్శించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని ఆరోపించారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైన కూడా అక్షరాలు తెలుగులో కాకుండా ఇంగ్లీంష్‌లోనే ముద్రించారని ధ్వజమెత్తారు. చట్టప్రకారం శిలాఫలకాలపై ప్రాంతీయ భాషనే వాడాలని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను ఎక్కడా వాడటం లేదన్నారు . చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనికి కారకులయిన వారిపై చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. -
ప్రధానికి యార్లగడ్డ అభినందనలు
న్యూఢిల్లీ: అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ అన్ని ప్రధాన కార్యక్రమాల్లో హిందీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీని కేంద్ర హిందీ సలహా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందించారు. ఐక్యరాజ్య సమితిలో తొలి సారి హిందీలో ప్రసంగించిన ఘనత మాజీ ప్రధాని వాజ్ పేయ్దేనని గుర్తుచేస్తూ సమితిలో హిందీని అధికార భాష చేయాలని ఆయన కలలుగన్నారని చెప్పారు. వాజ్‌పేయ్ కలలను మోదీ సాకారం చేయాలని యార్లగడ్డ కోరారు. -
రేపు విశాఖ బీచ్ రోడ్డులో సంగీతకళానిధి
-
రేపు విశాఖ బీచ్ రోడ్డులో సంగీతకళానిధి
విశాఖ: విశాఖ జిల్లాలో బీచ్‌రోడ్డులో మంగళవారం సంగీత కళానిధి కార్యక్రమం జరగనున్నట్టు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత భాండాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 54 ఏళ్ల పాటు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాల్లో నిరాఘంటంగా నేదునూరి పాడిన కీర్తనలు సంగీత ప్రియుల కోసం భాండాగారంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. భాండాగారంలో 520 మంది వాగ్గేయ, 31,400 సంగీత విద్వాంసుల కీర్తనలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎల్. రాఘవన్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పప్పు వేణుగోపాలరావు సహకారంతో అందిస్తున్నామన్నారు. భారతదేశం సంగీత విద్వాంసుడి పేరుమీద భాండాగారం తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారి అని యార్లగడ్డ చెప్పారు. భాండాగారం ఏర్పాటుకు సాయమందించిన కార్పొరేషన్, మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
'తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలి'
ఢిల్లీ: విద్యార్థులు తమిళంలోనే పరీక్షలు రాయాలని తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇతర భాషల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరిన ఆయన దీనిపై ఈ నెల 23న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. -
'హిందీని దేశ బాషగా తీర్చిదిద్దాలి'
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికారభాష చేయాలన్నా, విశ్వభాషగా మార్చాలన్నా దేశభాషగా తీర్చిదిద్దాల్సిన అసవరం ఎంతైనా ఉందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అభిప్రాయపడ్డారు. హిందీయేతర రాష్ట్రాలను అలక్ష్యం చేస్తే, హిందీ ఎప్పటికీ విశ్వభాష కాలేదని ఆయన అన్నారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో భోపాల్‌లో నిర్వహిస్తున్న 10వ ప్రపంచ హిందీ మహాసభల్లో శుక్రవారం 'హిందీయేతర భాషా ప్రాంతాల్లో హిందీ' అంశంపై గోష్టిని ఆయన ప్రారంభించారు. హిందీయేతర రాష్ట్రాల్లోని హిందీ సంస్థల్లోని ఉద్యోగాలను స్థానిక పండితులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రాల స్థానిక భాషల్లోని సాహిత్యాన్ని హిందీలోకి అనువదించి ఉత్తరాది రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చేరిస్తే జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సూచించారు. -
'బాబు.. ఆ మాట నిలబెట్టుకునే సమయమిదే'
తూర్పుగోదావరి(రాజమండ్రి): ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిలో పుష్కర స్నానం చేసి, రాజమండ్రి కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. సి.పి.బ్రౌన్ మందిరం ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఏకదిన చైతన్య దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుతో మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆగస్టు 12 నుంచి ఏపీలో అస్తిత్వాన్ని కోల్పోయిందన్నారు. ఏపీకి సంబంధించి రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలంలోని పీఠాలు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. వీటి నిర్వహణతో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న అధికారికంగా ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు, బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ అయోమయంలో పడింది. మన రాష్ట్రంలో ఉన్న పీఠాల నిర్వహణకు ఏటా రూ.6 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే, ఒప్పందంపై సంతకం చేయడానికి ముందుకు రావడం లేదు. మరో రూ.4 కోట్లు కలిపి.. మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో మనమే ఈ కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. రూ.10 కోట్లు ఏపీ ప్రభుత్వం వద్ద లేవంటే నేను నమ్మను’ అని యూర్లగడ్డ అన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బ్రౌన్ మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి, సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం విశ్రాంత కార్యనిర్వాహక సభ్యుడు వై.కె.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'తెలుగు వర్సిటీకి చేటు చేస్తే ప్రజలు సహించరు'
ఆల్కాట్‌తోట(రాజమండ్రి): తెలుగు విశ్వవిద్యాలయానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఆ సంస్థను కాపాడి తెలుగుతల్లి గౌరవాన్ని నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగువిశ్వవిద్యాలయాన్ని అస్థిర పరిచి ఉద్యోగులను, విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా రిలీవ్ చేసిందన్నారు. రాష్ట్ర విభజన 10వ షెడ్యూలులో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి, చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు లేని అడ్డంకులు తెలుగువిశ్వవిద్యాలయూనికి ఏ విధంగా అడ్డు వచ్చాయని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం పరిరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చైతన్యదీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ దీక్షలో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారన్నారు.