
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తెలుగును అవమానించిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి తెలుగంటే గౌరవం లేదని విమర్శించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని ఆరోపించారు.
శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైన కూడా అక్షరాలు తెలుగులో కాకుండా ఇంగ్లీంష్‌లోనే ముద్రించారని ధ్వజమెత్తారు. చట్టప్రకారం శిలాఫలకాలపై ప్రాంతీయ భాషనే వాడాలని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను ఎక్కడా వాడటం లేదన్నారు . చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనికి కారకులయిన వారిపై చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment