Uncle-nephew
-
ఆస్తి కోసం.. బిర్యానిలో నిద్రమాత్రలు కలిపి
జమ్మలమడుగు రూరల్: మానవ సంబంధాలు రోజురోజుకు మంట గలుస్తున్నాయి. ఆస్తి కోసం మమతానురాగాలను మరిచి మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ వాటాకు వస్తాడోనని కిరాతకానికి ఒడిగట్టాడు మేనమామ. తన బావ మొదటి భార్య కుమారుడుని అంతమొందించాలని కుట్ర పన్నాడు. అతన్ని అడ్డు తొలగిస్తే యావదాస్తికి తన అక్క కుమారుడే వారసుడని భావించాడు. బిరియాని ప్యాకెట్టులో నిద్రమాత్రలు కలిపి హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ సంఘటన బుధవారం దేవగుడిలో చొటు చేసుకొంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన సైలాస్‌కు 15 ఏళ్ల కిందట కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి అఖిల్ అనే కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల తర్వాత కనకమ్మ మృతి చెందింది. సైలాస్ పుష్పలత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య కుమారుడు అఖిల్ జమ్మలమడుగు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. సైలాస్‌కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆస్తిలో అఖిల్ వాటాకు వస్తాడని పుష్పలత తమ్ముడు రమేష్ దుర్బుద్ధితో ఆలోచించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలనుకున్నాడు. బుధవారం పట్టణానికి వచ్చి బిరియాని పాకెట్టు కొనుగోలు చేశాడు. అందులో కొన్ని నిద్రమాత్రలు వేసి మరో వ్యక్తి చేతికి ఇచ్చాడు. ‘మీ తండ్రి పంపించాడని అఖిల్‌కు ఇవ్వమని’చెప్పాడు. అఖిల్ తన స్నేహితులతో కలిసి బిరియాని తిన్నారు. కాసేపైన తర్వాత ముగ్గురు కుప్పకూలిపోయారు. గ్రహించిన అధ్యాపకులు, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు. -
మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పోలీసుల కథనం.. పెంగవ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడేళ్ల కూతురు భవ్యశ్రీతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే చిన్నారితో కలిసి నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన సొంత చిన్నాన్న కుమారుడు వినోద్.. రాత్రి 11 గంటల సమయంలో టార్చిలైట్ సాయంతో వారి వద్దకు వెళ్లి తల్లి పక్కనే పడుకున్న భవ్యశ్రీ మెడను కత్తితో కోశాడు. భవ్యశ్రీ గిలగిలా కొట్టుకోవడంతో పార్వతికి మెలకువ వచ్చి చూసేసరికి వినోద్ పారిపోయాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. పార్వతిని భర్త వదిలేయడంతో అతని మీద కోపం పెంచుకున్న వినోద్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వినోద్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. -
ఆకతాయి అల్లుడు... మామకు చిక్కులు
అంబర్‌పేట: ఓ బాలుని ఆకతాయితనం సొంత మేనమామకే చిక్కులు తెచ్చి పెట్టింది. సంబంధం లేని వారి చేతిలో అకారణంగా దెబ్బలు తినడమే కాకుండా పోలీసు స్టేషను గడప తొక్కాల్సి వచ్చింది. సినిమా ట్విస్ట్‌ను తలపించే ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ కథనం ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివసించే లత కుమారుడు కార్తీక్ స్థానికంగా ఓ పాఠశాలలో 3 వ తరగతి చదువుతున్నాడు. ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్న తల్లి ఆ విధుల నిమిత్తం ఉదయం బయటకు వెళ్తూ తన తమ్ముడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి కార్తీక్‌కు క్షవరం చేయించుకు రావాల్సిందిగా కోరింది. దీంతో అతను కాచిగూడలో ఉన్న సెలూన్‌కు మేనల్లుడ్ని ఆటోలో తీసుకెళ్లాడు. అనంతరం ఆటోలో అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ వరకు వచ్చిన ప్రవీణ్ , తాను వేరే పనులపై వెళ్లేందుకు... అక్కడి నుంచి కార్తీక్‌ను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా తన తమ్ముడు అశ్విన్‌ను పిలిచి అప్పగించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారు నడుచుకుంటూ వెళ్తుండగా బాలుడు చిన్నమామను ఎటువైపు తీసుకెళ్తున్నావని నిలదీస్తూ ఏడుపు మొదలు పెట్టాడు. దారిలో వీరిని గమనించిన వారు ఏమైందని ప్రశ్నించడంతో అతనెవరో తనకు తెలీదని, తనను కొడుతున్నాడంటూ మామపైనే వారికి కార్తీక్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అశ్విన్ చెప్పింది వినిపించుకోకుండా అతడిని చితకబాదారు. అనంతరం అశ్విన్‌ను, బాలుడిని అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. పోలీసుల వద్దకూడా కార్తీక్ తనకు అశ్విన్ తెలియదనే చెప్పడంతో వారూ తొలుత ఆ మాటల్నే నమ్మారు. అంతే కాకుండా తన పేరు, ఫిర్యాదు సైతం రాసుకోవాలని కోరాడు దీంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో అశ్విన్ తన అన్న ప్రవీణ్‌కు ఫోన్ చేయడంతో అతను పోలీసుస్టేషన్‌కు వచ్చి అతను తన తమ్ముడేననీ, కార్తీక్ తమ అక్క కొడుకేనని చెప్పాడు. బాలుడు కూడా ప్రవీణ్‌ను చూసి తన మామ అని చెప్పడం విశేషం. చివరకు సోదరులిరువురూ తమ సోదరి లతతో పోలీసులతో మాట్లాడించడంతో కథ సుఖాంతం అయ్యింది. బాలుడ్ని పెద్దమామతో పోలీసులు పంపించేశారు. -
ఎవరి ధీమా వారిదే..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఎంత ఉన్న దో నిరూపించుకునేందుకు ఈ శాసనసభ ఎన్నికలు వేదికానున్నాయి. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతోపాటు ఈ సారి ఆయా పార్టీల్లోని ముఖ్యనాయకుల కుటుంబ సభ్యులు బరిలో ఉన్నా రు. అన్ని పార్టీల్లో ఈ పరిస్థితి దాదాపుగా ఉంది. సోదరుడు-సోదరి, ఇద్దరు సోదరులు లేదా ఇద్దరు సొంత అక్కా, చెల్లెలు, బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య, మామ-అల్లుడు, వదినే-మరిది ఇలా కుటుంబ సభ్యులు పోటీ పడుతుండంతో రసవత్తరంగా మారనుంది. విజయావకాశాలపై ఎవరి ధీమా వారిదే.. బీడ్ జిల్లాలో..... బీడ్ జిల్లా పర్లీ శాసనసభ నియోజక వర్గంలో సోదరి-సోదరుడి మధ్య పోటీ జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యే పంకజా పాలవే-ముండేకు వ్యతిరేకంగా బాబాయ్ కుమారుడు ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే బరిలో దిగారు. ఇక్కడ సొదరుడు, సోదరి మధ్య పోటీ మరింత తీవ్రం కానుంది. ఉస్మానాబాద్‌లో.... ఉస్మానబాద్ శాసన సభ నియోజకవర్గంలో బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య పోటీ జరగనుంది. శివసేన తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఓంరాజే నింబాల్కర్‌కు వ్యతిరేకంగా బాబాయ్ కుమారుడు, ఎన్సీపీ మాజీ మంత్రి రాణా జగ్జీత్సింగ్ పాటిల్ రెండోసారి ఎన్నికల బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో రాణాను ఓం రాజే ఓడించారు. లాతూర్‌లో... లాతూర్ జిల్లా నిలంగా నియోజక వర్గంలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంభాజీ పాటిల్ నిలంగేకర్, ఇతని బాబాయ్, కాంగ్రెస్ నాయకుడు అశోక్ పాటి ల్ నిలంగేకర్లు అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నా రు. 2004లో జరిగిన ఎన్నికల్లో తాతా-మనవడు బరిలో దిగారు. అప్పుడు తాతను ఓడించి మనవడు సంబాజీ పాటిల్ గెలిచారు. ఇప్పుడు బాబాయ్‌తో తలపడుతున్నారు. లాతూర్ లో.. లాతూర్ జిల్లాలో లాతూర్ రూరల్ నియోజక వర్గం లో వదినే-మరిదిలో బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున త్య్రంబక్ భిసే, అతడికి పోటీగా వదినే ఆశా భిసేకు ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరిది-వదినే మధ్య పోటీ హోరాహోరీగా జరగనుంది. అమరావతిలో...... అమరావతి నియోజకవర్గంలో ఇద్దరు సొంత అక్కా-చెల్లెలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్‌కు వ్యతిరేకంగా సొంత సోదరి సంయోగితా నింబాల్కర్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఠాకూర్‌కు మద్దతుగా సంయోగితా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో సొంత అక్కా, చెల్లెలు బరిలో దిగుతున్నారు. కాటోల్ నియోజక వర్గంలో... కాటోల్ నియోజక వర్గంలో బాబాయ్-అబ్బాయ్ లు పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆశీష్ దేశ్‌ముఖ్ తన బాబాయ్, ఎన్సీపీ మాజీ మంత్రి అనీల్ దేశ్ముఖ్తో తలపడుతున్నారు. అతనిపై ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో అనిల్ దేశ్‌ముఖ్‌కు విజయం వరిం చింది. ఇప్పుడు గెలుపు ఎవరినివరిస్తుందో తేలాల్సి ఉంది. చంద్రాపూర్‌లో.... చంద్రాపూర్ జిల్లా వరోరా నియోజక వర్గంలో అసావరి దేవ్‌తలే కాంగ్రెస తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆమె మరిది, మాజీ మంత్రి సంజయ్ దేవ్‌తలే పోటీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన అనేక మంది అభ్యర్థులు కుటుంబ సభ్యులే కావడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.