సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఎంత ఉన్న దో నిరూపించుకునేందుకు ఈ శాసనసభ ఎన్నికలు వేదికానున్నాయి. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతోపాటు ఈ సారి ఆయా పార్టీల్లోని ముఖ్యనాయకుల కుటుంబ సభ్యులు బరిలో ఉన్నా రు. అన్ని పార్టీల్లో ఈ పరిస్థితి దాదాపుగా ఉంది. సోదరుడు-సోదరి, ఇద్దరు సోదరులు లేదా ఇద్దరు సొంత అక్కా, చెల్లెలు, బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య, మామ-అల్లుడు, వదినే-మరిది ఇలా కుటుంబ సభ్యులు పోటీ పడుతుండంతో రసవత్తరంగా మారనుంది.
విజయావకాశాలపై ఎవరి ధీమా వారిదే..
బీడ్ జిల్లాలో.....
బీడ్ జిల్లా పర్లీ శాసనసభ నియోజక వర్గంలో సోదరి-సోదరుడి మధ్య పోటీ జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యే పంకజా పాలవే-ముండేకు వ్యతిరేకంగా బాబాయ్ కుమారుడు ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే బరిలో దిగారు. ఇక్కడ సొదరుడు, సోదరి మధ్య పోటీ మరింత తీవ్రం కానుంది.
ఉస్మానాబాద్‌లో....
ఉస్మానబాద్ శాసన సభ నియోజకవర్గంలో బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య పోటీ జరగనుంది. శివసేన తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఓంరాజే నింబాల్కర్‌కు వ్యతిరేకంగా బాబాయ్ కుమారుడు, ఎన్సీపీ మాజీ మంత్రి రాణా జగ్జీత్‌సింగ్ పాటిల్ రెండోసారి ఎన్నికల బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో రాణాను ఓం రాజే ఓడించారు.
లాతూర్‌లో...
లాతూర్ జిల్లా నిలంగా నియోజక వర్గంలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంభాజీ పాటిల్ నిలంగేకర్, ఇతని బాబాయ్, కాంగ్రెస్ నాయకుడు అశోక్ పాటి ల్ నిలంగేకర్‌లు అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నా రు. 2004లో జరిగిన ఎన్నికల్లో తాతా-మనవడు బరిలో దిగారు. అప్పుడు తాతను ఓడించి మనవడు సంబాజీ పాటిల్ గెలిచారు. ఇప్పుడు బాబాయ్‌తో తలపడుతున్నారు.
లాతూర్ లో..
లాతూర్ జిల్లాలో లాతూర్ రూరల్ నియోజక వర్గం లో వదినే-మరిదిలో బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున త్య్రంబక్ భిసే, అతడికి పోటీగా వదినే ఆశా భిసేకు ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరిది-వదినే మధ్య పోటీ హోరాహోరీగా జరగనుంది.
అమరావతిలో......
అమరావతి నియోజకవర్గంలో ఇద్దరు సొంత అక్కా-చెల్లెలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్‌కు వ్యతిరేకంగా సొంత సోదరి సంయోగితా నింబాల్కర్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఠాకూర్‌కు మద్దతుగా సంయోగితా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో సొంత అక్కా, చెల్లెలు బరిలో దిగుతున్నారు.
కాటోల్ నియోజక వర్గంలో...
కాటోల్ నియోజక వర్గంలో బాబాయ్-అబ్బాయ్ లు పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆశీష్ దేశ్‌ముఖ్ తన బాబాయ్, ఎన్సీపీ మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్‌తో తలపడుతున్నారు. అతనిపై ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో అనిల్ దేశ్‌ముఖ్‌కు విజయం వరిం చింది. ఇప్పుడు గెలుపు ఎవరినివరిస్తుందో తేలాల్సి ఉంది.
చంద్రాపూర్‌లో....
చంద్రాపూర్ జిల్లా వరోరా నియోజక వర్గంలో అసావరి దేవ్‌తలే కాంగ్రెస తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆమె మరిది, మాజీ మంత్రి సంజయ్ దేవ్‌తలే పోటీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన అనేక మంది అభ్యర్థులు కుటుంబ సభ్యులే కావడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
ఎవరి ధీమా వారిదే..!
Published Sun, Oct 5 2014 10:39 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement
Advertisement