రాణించిన అనంతపురం
కడప స్పోర్ట్స్ :
కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ మ్యాచ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం నగరంలోని కేఓఆర్ఎం క్రీడామైదానంలో కడప, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. జట్టులోని పి. గిరినాథరెడ్డి మరోసారి చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 130 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఈయనకు జతగా మహబూబ్‌పీరా 59 పరుగులు, ప్రవీణ్ 56, షకీర్ 50 పరుగులు చేయడంతో అనంతపురం చక్కటి స్కోరును చేయగలిగింది. కాగా కడప బౌలర్ హరిశంకర్‌రెడ్డి 6 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో విశాఖ...
కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో విశాఖ–గుంటూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు 35.3 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని మణికంఠస్వామి 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విశాఖ బౌలర్లు అజయ్‌కుమార్ 5, ప్రశాంత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి 47 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. జట్టులోని వంశీకృష్ణ 56 పరుగులు చేశాడు. గుంటూరు బౌలర్
ప్రణయ్‌కుమార్ 2 వికెట్లు తీశాడు. దీంతో తొలిరోజు ఆటముగిసింది.