ఐర్లాండ్‌లో అండర్వేర్ ఉద్యమం.!
డబ్లిన్ : అండర్వేర్ ఉద్యమం ఇప్పుడు ఐర్లాండ్‌ను కుదిపేస్తోంది. ThisIsNotConsent... అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ మహిళలు అండర్వేర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల కార్క్ అనే పట్టణంలో ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడైన 27 ఏళ్ల వ్యక్తిని న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఢిఫెన్స్ లాయర్.. మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను చూపిస్తూ.. ‘ఈ అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుందో చూడండి. ఇలాంటి దుస్తులతోనే ఆమె అతన్ని అకర్షించే ప్రయత్నం చేసింది’ అని వాదించారు.
ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఎంతటి దుమారం అంటే ఆ దేశ మహిళా ఎంపీ రూత్ కాపింజర్ స్వయంగా పార్లమెంట్లో అండర్వేర్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపేంతా.. ఆమె స్పూర్తితో ఆ దేశ మహిళా లోకం కదిలింది. ‘ఎలాంటి అండర్ వేర్ వేసుకుంటే ఏంటీ..? అలాంటి లోదుస్తులు వేసుకున్నంత మాత్రానా శృంగారానికి సమ్మతి తెలిపినట్టు కాదు కదా? అని ప్రశ్నిస్తూ భగ్గుమన్నారు. వారికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ ఘటనతో మహిళలు వేసుకునే దుస్తుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
Counsel for man acquitted of rape suggested jurors should reflect on underwear worn by the 17yo complainant. Following this wholly unacceptable comment, we are calling on our followers to post a picture of their thongs/knickers to support her with the hashtag #ThisIsNotConsent pic.twitter.com/ZkVU0GVAIN
— I Believe Her - Ireland (@ibelieveher_ire) November 10, 2018
To bring a victims underwear into a rape trial as a reason for the rape is beyond despicable. #ThisIsNotConsent #IBelieveHer pic.twitter.com/wZPOqLEzLJ
— SarahCailleach (@Starlanna) November 11, 2018
Jurors in Cork were asked to consider the underwear a SEVENTEEN YEAR OLD GIRL was wearing when she was raped by a 27-year-old man.
Join the cause in solidarity, can’t believe this girl was subjected to these comments after such a traumatic event.#ThisIsNotConsent #Ibelieveher pic.twitter.com/PfkYERulgY
— Courtney Peterson (@_courtneymaria) November 13, 2018