ఆమె 'ఆ ఫొటోలు' దొంగలించి అరెస్టయ్యాడు!
టోక్యో: ఓ మహిళ ఫేస్బుక్ ఖాతాలోకి చొరబడి.. ఆమె లోదుస్తుల్లో దిగిన వ్యక్తిగత ఫొటోలను దొంగతనంగా డౌన్ లోడ్ చేసుకున్న టోక్యోకు చెందిన వ్యక్తి అరెస్టయ్యాడు. జపాన్ లో ఇలాంటి ఘటన జరుగడం ఇదే తొలిసారి. టోక్యోకు చెందిన ర్యోసుకె కొగా (25) గత జనవరి, మార్చ్ మధ్యకాలంలో 17 సార్లు ఓ మహిళ ఫేస్ బుక్ అకౌంట్ లోకి చొరబడి.. ఆమె అండర్ వేర్ లో దిగిన పలు ఫొటోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు.
అంతేకాకుండా అతని వద్ద 770 ఫేస్ బుక్, ఐ క్లౌడ్ ఐడీల వివరాలు ఉన్నాయని, ఈ వివరాలు అతని వద్దకు ఎలా వచ్చాయి? ఆ వివరాలతో అతను ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నామని టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో అతనికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3.20 లక్షల జరిమానా విధించే అవకాశముంది. కొగా గత ఏడాది శృంగారబద్ధంగా ఉన్న కొన్ని ఫొటోలను ఇంటర్నెట్ లో పోస్టు చేశాడు. దీంతో అతని ఇంటిపై దాడులు జరిపిన పోలీసులు.. అక్కడ ఐడీల వివరాలే కాకుండా.. పలువురు మహిళల ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు.