unhurt
-
లక్నో టీ20లో అపశ్రుతి..
లక్నో : భారత్, వెస్టిండీస్‌ల మధ్య లక్నోలో మంగళవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. నూతనంగా నిర్మించిన అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కామెంటరీ బాక్స్‌లోకి సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్‌లు చేరుకున్న కొద్దిసేపటికే గ్లాస్ డోర్స్ పగిలాయి. ఈ ఘటన నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. తాము లోపలికి ప్రవేశించగానే గ్లాస్ డోర్స్‌లో ఒకటి కుప్పకూలిందని అదృష్టవశాత్తూ తామంతా క్షేమంగా ఉన్నామని మంజ్రేకర్ చెప్పుకొచ్చారు. కాగా ఇకానా స్పోర్ట్స్ సిటీలోని ఈ స్టేడియం ప్రైవేట్ ఆస్ధి కావడంతో తామేమీ చేయలేమని యూపీ క్రికెట్ అసోనియేషన్ అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్‌ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు సైతం స్టేడియం నిర్వాహకుల వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీడియా బాక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, వపర్ కనెక్షన్లు లోపభూయిష్టంగా ఉండటంతో పాటు పలుమార్లు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఎదురవడంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. -
పల్టీలు కొడుతూ యాక్సిడెంట్.. చివర్లో ట్విస్ట్
అహ్మదాబాద్ : ఇలాంటి యాక్సిడెంట్ వీడియో ఇంతకు ముందు బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టి పడిపోయింది. ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే అందులో ఉన్నవాళ్లు సురక్షితంగా బయటపడే ఛాన్సే లేదనుకుంటాం. కానీ, గుజరాత్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ తాలూకు వీడియో ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఓ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదం చూసిన వారేవరైనా కనీసం లోపల ఉన్నవాళ్లు గాయాలపాలై ఉంటారని అనుకుంటారు. కానీ, అందులో ఉన్న ప్రయాణికులిద్దరూ చిన్న గీత కూడా పడకుండా దర్జాగా బయటకు రావటం వీడియోలో చూడొచ్చు. మోర్బి పట్టణంలోని ఆదివారం మధ్యాహ్నం ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
ప్రముఖ క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం
రియోడి జనిరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డిన్హో (35) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన తల్లి పోర్టో అలిగ్రే పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అది పెద్ద ప్రమాదమేనని, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని.. ఇది చాలా గొప్పవిషయమని రొనాల్డిన్హో ప్రతినిధి తెలిపారు. ప్రమాదం జరిగినపుడు అతడి వ్యక్తిగత డ్రైవరు కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రొనాల్డిన్హో రెండుసార్లు అందుకున్నాడు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో. మెరుపు దాడులతో అనేకసార్లు జట్టుకు విజయాన్ని అందించిన ఘనత అతడి సొంతం.